(Image source from: Indianexpress.com)
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిలో కోనసాగుతున్న తనపై సీబిఐ విచారణకు అదేశిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో తనపై వచ్చిన అవినీతి అరోపణలు.. వాటిపై సీబిఐ చేత విచారణ నుంచి ముఖ్యమంత్రికి ఊరట లభించింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న త్రివేంద్ర సింగ్ రావత్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సీఎం రావత్ పై వచ్చిన అవినీతి అరోపణలపై సీబిఐ చేత విచారణ జరిపించాలని ఉత్తరాఖండ్ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దీంతొ విమర్శలను స్వీకరించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని పేర్కోన్న న్యాయస్థానం.. సీబిఐ విచారణకు గత మంగళవారం అదేశిస్తూ తీర్పును వెలువరించింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో తాము సీబిఐ విచారణకు అన్నివిధాలా సహకరిస్తామని చెప్పిన సీఎం.. హుటాహుటిన హైకోర్టు తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఎం రావత్ దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడంతో ఊరట లభించింది. ముఖ్యమంత్రిపై రావత్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబిఐ) దర్యాప్తుకు హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులపై దేశఅత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. అసలేం జరిగిందంటే.. 2016లో టీఎస్ రావత్ ఝార్ఖండ్ బీజేపీ ఇంచార్జీగా ఉన్న సమయంలో రాంచికి చెందిన అమృతేష్ చౌహాన్ అనే వ్యక్తిని గో రక్షణ సంఘం అధ్యక్షుడిగా నియమించేందుకు పెద్దస్థాయిలో డబ్బు చేతులు మారయని అరోపణలు వచ్చాయి.
రావత్ ఆమోదంతో అమృతేష్ చౌహాన్ కు పదవి కూడా లభించిందని జర్నలిస్టు ఉమేష్ శర్మతో పాటు శివప్రసాద్ సెమ్వాల్ లు తమ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వారిపై కేసులు పెట్టింది. దీంతో తమపై పెట్టిన కేసులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు జర్నలిస్టులు ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారి పిటీషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం విమర్శలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడంతో ప్రజాస్వామ్యం మరింత బలపడుతోందని అభిప్రాయపడి సీఎం రావత్ పై సీబిఐ విచారణకు అదేశించింది. దీనిని తొలుత స్వాగతించిన సీఎం తరువాత పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ పెరగడంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తమపై జూలైలో దాఖలు చేసిన మొదటి సమాచార నివేదికను రద్దు చేయాలని జర్నలిస్టులు ఉమేష్ శర్మ, శివ ప్రసాద్ సెమ్వాల్ రెండు పిటిషన్లు దాఖలు చేయడంతో అవినీతి వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది, జార్ఖండ్ కు చెందిన అమృతేష్ చౌహాన్ నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) తర్వాత ముఖ్యమంత్రికి సంబంధికులైన హరేంద్ర సింగ్ రావత్, అతని భార్య సవితా రావత్ బ్యాంకు ఖాతాలో రూ. 25 లక్షల మేర డబ్బు జమ చేశాడని జర్నలిస్ట్ ఉమేష్ శర్మ సోషల్ మీడియా పోస్ట్‌లో ఆరోపించిన నేపథ్యంలో జర్నలిస్టులపై కేసు నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more