Joe Biden wins more votes in American history అగ్రరాజ్య ఎన్నికల్లో గెలుపు ముంగిట బిడెన్.. పాప్యూలర్ ఓట్ల రికార్డు

Us election joe biden nears the 270 victory mark trump mounts legal battle in several states

us election results, us election results date, us election 2020, us election, joe biden, us election date, american election, us election 2020 results date, kamala harris, biden, us presidential election, america election result date, us elections, american election result date, us election 2020 result date, trump vs biden, us presidential election results, us presidential election results date, us election prediction, who will win us election, us presidential election 2020

Democratic presidential candidate Joe Biden and his running mate Senator Kamala Harris of Indian origin inched closer to the magic figure of 270 Electoral College votes, even as incumbent Republican President Donald Trump moved ahead with his plan to mount a massive legal battle.

అగ్రరాజ్య ఎన్నికల్లో గెలుపు ముంగిట బిడెన్.. పాప్యూలర్ ఓట్ల రికార్డు

Posted: 11/05/2020 01:05 PM IST
Us election joe biden nears the 270 victory mark trump mounts legal battle in several states

(Image source from: Manatelangana.news)

అగ్రరాజ్యం అమెరికాలో బరిలో నువ్వా-నేనా అన్నట్లు ఇటు రెపబ్లికన్ పార్టీ తరపున ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అటు డెమొక్రాట్ల తరపున జో బిడెన్ బరిలో నిలిచినా.. అమెరికన్ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు మాత్రం బిడెన్ను గెలుపు ముంగిట నిలిపింది, అమెరికాలోని ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో వున్న 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 ఓట్లు సాధించిన అభ్యర్థిని విజయం వరించినట్లే. డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ ఇప్పటికే 264 ఓట్లను సాధించి విజయానికి చేరువలో నిలువగా, రిపబ్లికన్ అభ్యర్థైన ట్రంప్ 214 ఓట్లకే పరిమితం అయ్యారు.

ఇప్పటికీ పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, నెవెడా, అలస్కా రాష్ట్రాల్లో తుది ఫలితం వెల్లడి కావాల్సి వుంది. అయితే స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ అదిపత్యం కనబర్చే అవకాశాలు వున్నాయని సమాచారం. నెవెడా మినహా అన్ని రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో కూడా బిడెన్ నుంచి ఆయన గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో 50.3 శాతం జో బిడెన్ కు, 48.1 శాతం డొనాల్డ్ ట్రంప్ కు వచ్చాయి. 7,14,52,650 పాప్యులర్ ఓట్లు బైడెన్ కు రాగా, 6,82,23,592 ఓట్లు ట్రంప్ కు వచ్చాయి.

కాగా డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ 7,14,52,650 పాప్యులర్ ఓట్లతో చరిత్ర సృష్టించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మునుపెన్నడూ ఏ అధ్యక్ష అభ్యర్థికి రాని విధంగా పాప్యూలర్ ఓట్లు ఆయన సొంతం చేసుకున్నారు, యూఎస్ చరిత్రలోనే ఈ మేరకు ఓట్లను సాధించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు అత్యధిక పాప్యూలర్ ఓట్ల రికార్డు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేరును లిఖించబడివుండగా, దానిని జో బిడెన్ తిరగరాశారు, 2008లో జరిగిన ఎన్నికల్లో ఒబామాకు అత్యధికంగా 6.94 కోట్ల ఓట్లు వచ్చాయి. ఈ రికార్డును తాజాగా బైడెన్ అధిగమించారు.

తొలి నుంచి ట్రంప్ కు అనుకూలంగా ఉన్న విస్కాన్సిస్, మిచిగన్ రాష్ట్రాల్లో చివరి గంటల్లో అనూహ్యంగా బైడెన్ పుంజుకుని, గెలవడంపై ట్రంప్ మండిపడ్డారు. ఈ రాష్ట్రాల్లో మోసం జరిగిందని ఆయన ఆరోపించారు. ఇదే తరహాలో స్వింగ్ రాష్ట్రాల్లోనూ అయన చివరి నిమిషంలో ఓట్లను కోల్పోయిన పక్షంలో బిడెన్ అగ్రరాజ్య అధినేత పగ్గాలను అందుకోవాల్సిందే. కాగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జో బిడెన్.. ఇది అమెరికన్లందరూ కలసికట్టుగా సాధించిన విజయంగా పేర్కోన్నారు, ఇక, చివరి వరకూ తాను ఆధిక్యంలో ఉన్న మిచిగన్ లో బైడెన్ గెలవడాన్ని తట్టుకోలేకపోతున్న ట్రంప్ కోర్టుకు వెళ్లి తీరుతానని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles