(Image source from: Jagran.com)
తనను ప్రేమించిన యువకుడితో జీవితాంతం కలసి బతకాలని నిర్ణయించుకున్న యువతి.. ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి వివాహం చేసుకోవడం లేదా ప్రేమించిన వాడి కోసం పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం ఈ మద్యకాలంలో మనం చూస్తున్నాం. ఇలా కాని పక్షంలో పెద్దలకు చెప్పలేక.. వారు అంగీకరించని తెలిసిన ప్రేమికులు ఇంట్లోంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకోవడం కూడా ఈ మధ్యకాలంలో కామన్ గా కనిపిస్తోంది. కానీ కర్నూలులో విభిన్న ప్రమేకథ వెలుగుచూసింది. అంత విచిత్రం ఏముందీ అంటారా.?
యువతిని ప్రేమించే యువకుడో.. లేక యువకుడ్ని ప్రేమించిన యువతి కథనో మనం ఇన్నాళ్లు చూశాం.. కానీ కర్నూలు జిల్లాలో తొలిసారిగా ఓ యువతిని ప్రేమించిన యువతి కథను చూశం. అంతేకాదు వీరద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరిని వదలి మరోకరు ఉండలేనందగా వీరి ప్రేమ బంధం పెనవేసుకుపోయింది. ఇక తమను ఎవ్వరూ విడదీయకూడదని భావించిన ఈ ఇద్దరు అమ్మాయిలు ఒకరికోసం మరోకరు ఇంటి నుంచి పారిపోయారు. పోతూ పోతూ తమ ప్రేమ విషయం పెద్దలకు అర్థమయ్యేలా ఓ చిన్న సందేశాన్ని వారికి వదిలివెళ్లారు. దీంతో వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన యువతి (21), నర్సింహారెడ్డినగర్ కు చెందిన యువతి (20) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారి స్నేహం ఇటీవల మరింత ముదిరి ప్రేమకు దారితీసింది. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. దీంతో ఈ నెల 3న ఇంట్లో చెప్పకుండా ఇద్దరూ కలిసి వెళ్లిపోయారు. వెళ్తూవెళ్తూ తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టారు. అది చూసి కంగారుపడిన ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతుల కోసం గాలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more