దేశీయ విమానాల ఛార్జీలపై ఇప్పటికే పరిమితి కొనసాగుతుందని, ఈ పరిమితిని 2021 ఫిబ్రవరి 24 వరకు కొనసాగిస్తామని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మే నెల నుంచి దేశీయ విమాన ఛార్జీల పరిమితి కొనసాగుతున్న విషయం తెలిసిందే. డీజీసీఏ విడదుల చేసిన చార్జీల పరిమితులు 40 నిమిషాల కన్నా తక్కువ వ్యవధి కలిగిన దేశీయ విమానాలు కనిష్టంగా రూ, 2,000 గరిష్టంగా రూ. 6000లుగా నిర్ణయించబడ్డాయి, అదే విధంగా 40-60 నిమిషాల రూ .2,500 నుంచి రూ .7,500, 60-90 నిమిషాలకు రూ .3,000- రూ .9,000, 90-120 నిమిషాలకు రూ .3,500- రూ .10,000, 120-150 నిమిషాలకు రూ .4,500- రూ .13,000, 150-180 నిమిషాలకు రూ .5,500- రూ .15,700లగా నిర్ణయించింది.
ఇదిలావుంటే.. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజారవాణాపై ఆంక్షలు, పరిమితులు కోనసాగుతున్న విషయం తెలిసిందే, దీంతో ఇక్కట్లు పడుతున్న ప్రయాణికుల కోసం కూడా కేంద్రం యోచిస్తొంది. ఇక ప్రయాణికుల సంఖ్యపై కూడా అంక్షలు కోనసాగుతున్నాయి, మే నుంచి విమానంలోని సీట్ల కెపాసిటీలో కేవలం 33శాతం మాత్రమే ప్రయాణికులను అనుమతించగా, ఆ తరువాత దానిని కాస్తా జూన్ 26 నుంచి 45శాతానికి పెంచారు, ఇక సెప్టెంబర్ 2 నుంచి 60 శాతం మంది ప్రయాణికులు కెపాసిటీని పెంచారు. ఇక తర్వలోనే ఈ కెపాసిటీని 75శాతం మేర పెంచనున్నట్లు కేంద్ర విమానయాన సంస్థ తెలిపింది. ఇక మరింతగా విమానయానాన్ని ప్రయాణికులకు చేరువ చేసే క్రమంలో భాగంగా మరో శుభవార్తను కేంద్రం వెలువరించింది.
దీపావళి కానుకగా విమాన ఛార్జీలను భారీగా తగ్గించింది. కరోనా కారణంగా ప్రజా రవాణాను ఆశ్రయించే వారి సంఖ్య తగ్గిపోగా, విమానాలు ఎక్కేవారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. అయితే, ఈ పండగ సీజన్ ను ఉపయోగించుకుని, తిరిగి ప్రయాణికుల సంఖ్యను పెంచాలని భావిస్తున్న కేంద్రం, గత సంవత్సరంతో పోలిస్తే 30 నుంచి 40 శాతం మేరకు చార్జీలను తగ్గించింది. తగ్గిన చార్జీల ప్రకారం, చెన్నై నుంచి బెంగళూరుకు రూ.1,700తోనే ప్రయాణించవచ్చు. ఇక హైదరాబాద్కు రూ.2,400 నుంచి రూ.2,800 వరకూ, ఢిల్లీకి రూ.4 వేల వరకూ చార్జీలను నిర్ణయించారు. ప్రస్తుతం అంతర్రాష్ట్రాల మధ్య మాత్రమే విమాన సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more