Assembly ByPoll results out today ఉపఎన్నికల ఫలితాలు: 56 అసెంబ్లీ స్థానాలలో విజయం వీరిదే..

Bjp bags four seats in manipur congress wins in chhattisgarhs marwahi

By election result,by election result 2020,by poll election,by poll election in mp,by poll election india,by poll election results today live,election results 2020, Madhya Pradesh, Chhattisgarh, Nagaland, Uttar Pradesh, Jharkhand, Telangana, Gujarat, Odisha, live updates, latest updates, latest news, live blog, highlights

Diwali seems to have arrived a few days early for the Bharatiya Janata Party (BJP) today. Even as counting of votes is underway in Assembly by-elections in Madhya Pradesh, Gujarat, Uttar Pradesh and in 8 other states, the saffron party has managed to pull a magnificent lead in a majority of seats across the states

ఉపఎన్నికల ఫలితాలు: 56 అసెంబ్లీ స్థానాలలో విజయం వీరిదే..

Posted: 11/10/2020 11:50 PM IST
Bjp bags four seats in manipur congress wins in chhattisgarhs marwahi

దేశంలోని 11 రాష్ట్రాలలో పలు కారణాల చేత ఖాళీ అయిన 56 అసెంబ్లీ స్థానాలు ఒక్క పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలోని 54 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న, మణిపూర్ లోని రెండు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న, దీంతో పాటు బీహార్ లోని పార్లమెంటు స్థానానికి కూడా నవంబర్ 7న ఎన్నికలు జరిగాయి, కాగా ఇవాళ వెలువడుతున్న ఫలితాల్లో పలు చోట్ల బీజేపి అభ్యర్థులు ముందంజలో వున్నారు.

మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ సుస్థిరతను నిర్ణయించేలా మారిన ఉప ఎన్నికలలో బీజేపి ముందంజలో కొనసాగుతోంది. ఇక్కడ ఈ నెల 3న పోలింగ్ నిర్వహించగా, ఏకంగా 66.37శాతం ఓట్లు నమోదయ్యాయి, ఎన్నికలు జరిగిన 28 సీట్లలో, అధికార బీజేపి అభ్యర్థులు 12 స్థానాలలో విజయం సాధించారు. ఇక్కడ ఇంకా పలు స్థానాలలో కౌంటింగ్ కొనసాగుతోంది. 12 స్థానాలను గెలిచిన బీజేపి ప్రభుత్వం రాస్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా, ఎనమిది నెలల క్రితం అధికారం కోల్పోయిన కాంగ్రస్ ప్రభుత్వం ఈ ఎన్నికలలో ఇప్పటికే మూడు స్థానాలను కైవసం చేసుకోగా మరో ఐదు స్థానలలో ముందంజలో కొనసాగుతోంది, అటు బీజేపి మరో ఏడు స్థానాల్లో ముందంజలో వుంది.

ఉత్తర్ ప్రదేశ్

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో విఫలమైందని ప్రతిపక్షాలు అరోపిస్తున్న తరుణంలో వచ్చిన ఉప ఎన్నికలలోనూ బీజేపి తన అధిపత్యం ప్రదర్శించింది. ఉత్తర్ ప్రదేశ్ లో ఉపఎన్నికలు జరిగిన ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాల్లో బీజేపి అభ్యర్థులు విజయదుంధఃభి మ్రోగించగా, ఒక్క స్థానంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి గెలుపోందారు.

గుజరాత్

గుజరాత్ లో మొత్తం ఎనిమిది అసెంబ్లీ సెగ్మంట్లలో జరిగిన ఉప ఎన్నికలలో అధికార బీజేపి అధిపత్యం ప్రదర్శించింది. ఎనమిదికి ఎనమిది స్థానాలను కైవసం చేసుకుంది. అయితే అభ్యర్థులను బ్లాక్ మెయిల్ చేసి.. అక్రమాలకు పాల్పడి బీజేపి ఈ స్థానాల్లో గెలిచిందని గుజరాత్ కాంగ్రెస్ అరోపిస్తోంది. జూన్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికలకు ముందే సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి.. ఆ తరువాత తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

కర్ణాటక

కర్ణాటక రాష్ట్రంలో రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ స్థానంతో పాటు సిరా అసెంబ్లీకి నవంబర్ 3 న ఉప ఎన్నికలకు పోలింగ్ జరిగింది, ఆగస్టులో జెడి (ఎస్) ఎమ్మెల్యే బి సత్యనారాయణ మరణించిన తరువాత సిరా ఉపఎన్నిక తప్పనిసరి కాగా, గత ఏడాది ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ప్రకారం అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ మునిరత్న అనర్హత వేటు వేయడంతో ఇక్కడి ఆర్‌ఆర్ నగర్ సీటు ఖాళీగా ఉంది. కాగా ఈ రెండు స్థానాలలో బీజేపి తమ అభ్యర్థులను గెలిపించుకుంది. ఆర్ఆర్ నగర్ అసెంబ్లీ సెగ్మంట్ నుంచి ఎస్ మునిరత్న 57,672 ఓట్ల అధిక్యంతో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కుసుమపై గెలుపోందారు, ఇక సిరా నియోజకవర్గంలో డాక్టర్ బీఎం రాజేశ్ గౌడ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 13 వేల ఓట్ల అధిక్యంతో గెలుపోందారు.

ఒడిశా

ఒడిశాలోని రెండు అసెంబ్లీ సెగ్మంట్లకు జరిగిన ఉపఎన్నికలలో అధికార బీజు జనతాదళ్ పార్టీ విజయం సాధించింది. టిర్టోల్, బాలసోర్ సదర్ అసంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 3న ఉప ఎన్నికలు జరిగాయి, బిజెపి ఎమ్మెల్యే మదన్ మోహన్ దత్తా మరణం ద్వారా బాలాసోర్లో ఉప ఎన్నిక అనివార్యం కాగా, జూలైలో ప్రముఖ దళిత నాయకుడు బిజెడి బిష్ణు చరణ్ దాస్ మరణంతో టిర్టోల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. టిర్టోల్అసెంబ్లీ స్థానం నుంచి బిష్ణు చరణ్ దాస్ తనయుడు బిజయ్ శంకర్ దాస్ ను బరిలోకి దింపిన బీజేడి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది, ఇక బీజేపి ఎమ్మెల్యే మదన్ మోహన్ మరణంతో ఖాళీ ఏర్పడిన రాజ్ కిషోర్ హెహరాను బరిలోకి దింపింది బీజేపి. అయితే బీజేపి అభ్యర్థిపై అధికార బీజేడీ పార్టీ అభ్యర్థి స్వరూప్ దాస్ ఈ స్థానం నుంచి గెలుపోందారు.

జార్ఖండ్

జార్ఖండ్ రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 3న ఉప ఎన్నికలు జరిగాయి, డుమ్కా అసెంబ్లీ సెగ్మంట్ తో పాటు బెర్మో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి, ఈ రెండు స్థానాలకు మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార జేఎంఎం- కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి చెందిన అభ్యర్థి బసంత్ సోరెన్ జేఎంఎం పార్టీ నుంచి గెలుపోందారు. ప్రతిపక్ష బిజెపి అభ్యర్థిపై ఆయన విజయం నల్లేరు మీద నడకలా సాగింది, ఇక బెర్మో స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కుమార్ జైమంగళ్ (అనూప్ సింగ్) తన సమీప బీజేపి అభ్యర్థిపై విజయం సాధించారు, రెండు స్థానాలకు 62.51 శాతం ఓట్టింగ్ నమోదయ్యింది.

నాగాలాండ్

నాగాలాండ్ రాష్ట్రంలోనూ రెండు అసెంబ్టీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి, కోహిమా జిల్లాలోని దక్షిణ అంగమి -1 అసెంబ్లీ నియోజకవర్గానికి, కిఫైర్ జిల్లాలోని పుంగ్రో-కిఫైర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. నాగ పీపుల్స్ ఫ్రంట్ మాజీ అసెంబ్లీ స్పీకర్ విఖో-ఓ యోషు మరణంలో ఖాళీ అయిన స్థానంలో మేడో యోక్లా గెలుపోందారు. తన సమీప స్వతంత్ర అభ్యర్థి పీటర్ జషుమోపై 598 ఓట్లతో గెలుపోందారు. ఇక పుంగ్రో-కిఫైర్ స్థానంలో పీపుల్స్ డెమెక్రటిక్ అలియన్స్ పీడిఏ తరపున పోటీచేసిన బీజేపి అభ్యర్థి లిరిమాంగ్ సంగటమ్ మూడో స్థానానికి పరిమితం కాగా, ఈ స్థానంలో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగిన యాంసీయో సంగటమ్ 1527 ఓట్లతో గెలుపోందారు.

మణిపూర్

మణిపూర్ రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీహార్ రాష్ట్రంలోని మూడో విడత ఎన్నికలతో పాటు మణిపూర్ లోని లిలోంగ్, వాంగ్‌జింగ్ తెంథా అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 7న ఉప ఎన్నికలు జరిగాయి. కాగా, వాంగోయ్, సైతు, సింఘాట్ల అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 3నే ఉపఎన్నికలు జరిగాయి. కాగా ఇక్కడ నాలుగు స్థానాల్లో బీజేపి విజయం సాధించింది, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. సింఘాట్ అసెంబ్లీ స్థానం పోటీ లేకుండా గెలుపోందారు.

తెలంగాణ

తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు విజయం సాధించారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పోరులో నువ్వా-నేనా అన్నట్టు సాగినా.. స్వల్ప మోజారిటీ 1407 ఓట్లతో రఘునందన్ రావును విజయం వరించింది, ఆగస్టులో ఆరోగ్య సమస్యల కారణంగా సిట్టింగ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీగా వున్న ఈ స్థానంలో ఉప ఎన్నికలు జరిగాయి, తెలంగాణలోని దుబ్బక్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో 82 శాతం పోలింగ్ నమోదైంది.

హర్యానా

హర్యానాలోని బరోడా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 68 శాతం పోలింగ్ నమోదైంది, ఈ స్థానంలో 14 మంది అభ్యర్థుల బరిలో నిలువగా పోటీ మాత్రం ప్రధనాంగా జాతీయ పార్టీల మధ్యే నెలకొంది. 1.81 లక్షల మంది ఓటర్లు ఉన్న బరోడా అసెంబ్లీ స్థానానికి ఒలింపియన్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగినా అపజయం పాలయ్యారు, 2009, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే క్రిషన్ హుడా తన మరణం తరువాత ఈ స్థానంలో కాంగ్రెస్ గెలుపోందేలా చేశారు, ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది, బీజేపి అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు పది వేల ఓట్ల మెజారిటితో గెలుపోందారు.

ఛత్తీస్ గఢ్

ఛత్తీస్ గఢ్ లోని మర్వాహీ అసెంబ్లీ సెగ్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్ కెకె ధృవ్ ఈ ఎన్నికలలో తన సమీఫ ప్రత్యర్థిగా వున్న బీజేపి అభ్యర్థి డాక్టర్ గంభీర్ సింగ్ పై 38వేల 197 ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఈ ఉపఎన్నికలలో 83,561 ఓట్లు రాగా, బీజేపి అభ్యర్థికి 45,364 ఓట్లు లభించాయి. అజిత్ జోగి మరణంతో ఈ స్థానంలో్ ఖాళీ ఏర్పడింది. నవంబర్ 3న జరిగిన ఈ ఉప ఎన్నికలలో 77.89 శాతం ఫోలింగ్ జరిగింది.

బీహార్

బీహార్ లోని వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఈ నెల 7 న ఉప ఎన్నికల జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు వాల్మీఖీ నగర్ పార్లమెంటు స్థానానికి ఓటర్లు తమ ఓటును వేశారు. ఫిబ్రవరిలో సిట్టింగ్ జెడి (యు) ఎంపి బైద్యనాథ్ ప్రసాద్ మహ్తో మరణించిన తరువాత వాల్మీకి నగర్ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉన్న వాల్మీకి నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వాల్మికి నగర్, రాంనగర్, నార్కటియాగంజ్, బగాహా, లౌరియా, సిక్తా అసెంబ్లీ స్థానాలు వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles