గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు నగరా మ్రోగింది. డిసెంబరు 1వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషనర్ పార్థసారథి విడుదల చేశారు. షెడ్యూల్ విడుదలతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. రేపటి నుంచే జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని పార్థసారథి చెప్పారు. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, మరో మూడు రోజుల వ్యవధిలో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. ఈ నెల 20 వరకు మాత్రమే నామినేషన్లకు గడుపును విధించడం.. కేవలం రెండున్నర రోజుల వ్యవధినే నామినేషన్లకు కల్పించారు.
ఈ నెల 21న నామినేషన్ల స్ర్కూటినీ జరుగుతుందని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 తుది గడువు అని చెప్పారు. డిసెంబరు 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందని అన్నారు. అయితే ఇన్నాళ్లు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరినా పట్టించుకోని ఎన్నికల కమీషన్.. జీహెచ్ఎంసీ ఎన్నికలను మాత్రం బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికల కమీషన్ నిర్వహిస్తోంది. ఈ మేరకు కమీషనర్ పార్థసారథి వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 వార్డులకు చట్ట ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లే ఇప్పుడూ కొనసాగిస్తామని తెలిపారు.
వార్డుల వారీగా రిజర్వేషన్ల కేటాయింపులు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని.. ఆ ప్రకారమే ఎన్నికల నిర్వహణ జరుగనుందని తెలిపారు, శాసనసభ ఎన్నికల నాటి ఓటర్ల జాబితా ఆధారంగానే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఓటు వేసేందుకు అర్హులని వివరించారు. బల్దియా పరిధిలో ఉన్న ఓటర్లలో 52.09 శాతం పరుషులు, 47.90 శాతం మహిళలు ఉన్నారని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 74,04,000 మందికి పైగా ఓటర్లున్నారని వెల్లడించారు. మైలార్దేవ్పల్లిలో అత్యధికంగా 79,290 మంది, రామచంద్రాపురంలో అత్యల్పంగా 27,997 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియకు కావాల్సిన అన్ని పనులు పూర్తి చేసినట్లు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more