(Image source from: Twitter.com/ANI)
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలపై కూడా నివర్ తుఫాను పంజా విసరనుంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కోనసాగుతున్న నివర్.. మరో 12 గంటల సమయంలో తుపానుగా రూపాంతరం చెందనుందని, ఆ తరువాత మరో 24 గంటల వ్యవధిలో అది తీవ్ర తుపానుగా మారి తీరం దాటనుందని చెన్నైలోని ప్రాంతీయవాతావరణ శాఖ హచ్చరికలు జారీ చేసింది. దీంతో ఈ మూడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 25వ తేదీ సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం-కరైకల్ మధ్య తుఫాను తీరం దాటే అవకాశాలు వున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ప్రస్తుతం నివర్ తుఫాను పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇక తీవ్ర తుపానుగా మారి నివర్ తీరం దాటనున్న నేపథ్యంలో అక్కడి భయానక వాతావరణం అలుముకోనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏకంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదరుగాలులు వీస్తాయని, దీంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షలు కూడా కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను తీరం దాటనున్న సమయంలో తమిళనాడు, పుద్దుచ్చేరిలోని తీర ప్రాంత లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చోచ్చుకువచ్చే ముప్పు కూడా వుందని వాతావరణ శాఖ తెలిపింది.
తమిళనాడులోని కడలూరు, విల్లుపురం, పుదుచ్చేరిలోని పలు జిల్లాల్లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరింపజేసింది. దీంతో పాటు తీరం దాటనున్న తమిళనాడు తీరప్రాంతంలో రెండు కోస్టుగార్డు నౌకలను కూడా ప్రభుత్వం రంగంలోకి దింపింది. నివర్ తుఫాను కారణంగా ఇవాళ్టి నుంచే తమిళనాడులోని కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు, ఇక తీరం దాటిన తరువాత తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు, ఇప్పుడే సముద్రం అల్లకల్లోంగా వుందని.. తీరం దాటే సమయానికి ఇది మరింత ఉదృతంగా మారనుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more