TRS MLA Nomula Narsimhaiah passes away నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

Trs mla from nagarjunasagar nomula narsimhaiah passes away at 64

trs mla, trs, nomula narasimhaiah, Nagarjunasagar, nakrekal, Bhuvanagiri, CPIM, peoples leader, Advocate, Nalgonda, Telangana, Politics

Telangana Ruling party TRS legislator from Nagarjunasagar in Nalgonda district Nomula Narsimhaiah passed away at a private hospital in Hyderabad on Tuesday. The 64-year-old leader has been ill for some time. He hailed from Palem village of Marxist-hotbed Nakrekal mandal, where he was its mandal parishad president for more than a decade.

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

Posted: 12/01/2020 02:43 PM IST
Trs mla from nagarjunasagar nomula narsimhaiah passes away at 64

(Image source from: Twitter.com/trspartyonline)

నాగార్జున సాగర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇవాళ అనారోగ్యంతో కన్నుమూశారు. నల్గొండ జిల్లా అభివృద్దిలో తన వంతు సాయాన్ని అందించిన ప్రజానాయకుడు అనారోగ్యం బారినపడి.. గత కొంతకాలంగా ఓ ప్రైవేటు అసుపత్రిలో చికిత్సపోందుతున్నారు. కాగా ఇవాళ ఉదయం పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. విద్యార్థి నాయకుడిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే నాయకుడి లక్షణాలను అందిపుచ్చుకున్న ఆయన ఆ తరువాత తన సొంత మండలంలో మండల పరిషత్ అధ్యక్షుడిగా కూడా దశాబ్ద కాలం పాటు సేవలు అందించారు.

ఆయన చేసిన సేవలను నకిరేకల్ అసెంబ్లీ ప్రజలు కూడా అమోదించారు. దీంతో ఆయన నకిరేకల్ అసెంబ్లీ స్థానం నుంచి 1999, 2004 రెండు పర్యాయాలు సీపీఎం పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికై తన నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవలను అందించారు. ఆ తరువాత ఆయన 2009లో భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత 2014లో ఆయన నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేతిలో పరాభవం పాలయ్యారు. కాగా 2018లో జరిగిన ఎన్నికలలో ఆయన జానారెడ్డిని దాదాపు ఏడు వేల ఓట్ల మోజారిటీతో ఓడించి.. చారిత్రక విజయాన్ని అందుకున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాది పట్టాను అందుకున్న ఆయన అప్పటి ఉమ్మడి అంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా కూడా కొనసాగారు. 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానంపై గురిపెట్టి విజయాన్ని అందుకున్నారు, ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు వున్నారు. కుమారుడు కూడా న్యాయవాదిగా రాణిస్తుండగా, ఇద్దరు కుమార్తెలు విదేశాలలో వున్నారు. నోముల నర్సింహయ్య మృతి విషయం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు, నోముల నర్సింహయ్య ప్రజానాయకుడని కోనియాడిని సీఎం ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles