(Image source from: Newindianexpress.com)
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని శివారు సింఘు, టిక్రీ ప్రాంతంలో నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. రైతు సంఘాల నేతలతో కేంద్రంలోని పెద్దలు పలు దఫాలుగా చర్చలు నిర్వహిస్తున్నా.. అవి కొలిక్కిరాలేదు. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రంగంలోకి దిగి రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపారు. అయిని రైతు సంఘాలు కేంద్రం ప్రతిపాదనలకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమకు ఎలాంటి ప్రతిపాదనలు వద్దని.. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను బేషుతా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రైతుల డిమాండ్ పట్ల కేంద్రం దిగిరావడం లేదు.
అయితే కేంద్రం దిగివచ్చి తమ డిమాండ్లను అంగీకరించే వరకు తమ ఉద్యమం ఎట్టి పరిస్తితుల్లో కోనసాగుతుందని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి. జాతికి అన్నం పెట్టే రైతుకు కేంద్రం సాయం చేయాల్సిందిపోయి చేతులను కట్టేసేలా నూతన చట్టాలను తీసుకువచ్చిందని.. అది చాలదన్నట్లు తమను దేశద్రోహులుగా, ప్రతిపక్ష పార్టీలకు చెందినవారిగా చిత్రీకరిస్తూ కేంద్రం నిర్లక్షం చేస్తోందని రైతుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. వెన్నులో చలి పుట్టేంతగా వున్నా.. చిన్నపిల్లలతో పాటు వయస్సు పైబడిన వృద్దుల వరకు ఎన్నో కుటుంబాలు ఇల్లు వాకిలీ వదిలి హస్తినకు చేరుకుని ధర్నా చేస్తున్నాయని, ఇప్పటికైనా తమ డిమాండ్లను కేంద్రం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
తొలుత వచ్చిన రైతులకు మద్దతుగా అనేక మంది రైతులు, రైతు సంఘాలు హస్తినకు చేరకుంటున్నాయి, ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, పిక్కెట్లు ఏర్పాటు చేసి హస్తినకు రైతులు చేరుకోకుండా ్యలు చేపడుతున్నా.. రైతులు మాత్రం నూతన వ్యవసాయ బిల్లులతో తమ ఉనికికే ప్రమాదం పోంచి వుందని ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. సింఘు, టిక్రీ శివారల్లోని రహదారులపై గూడారాలు వేసుకుని అక్కడే గత 24 రోజులుగా దీక్షలు చేపడుతున్నారు. రైతుల అంశాలపై కేంద్రం పలు దఫాలు చర్చలు నిర్వహించి విఫలమైనా రైతుల్లో మాత్రం ఎలాంటి నిరాశ, నిసృహలు కనిపించడం లేదు. ఎన్నడూ ఉద్యమం బాట పట్టని రైతులు తాను ఉద్యమిస్తే మాత్రం పలితం రావాల్సిందేనని ముక్తకంఠంతో చెబుతున్నాడు. మరి వీరి డిమాండ్లపై కేంద్రం ఎప్పుడు సానుకూలంగా స్పందిస్తుందో మరి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more