(Image source from: Twitter.com/ANI)
కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తిన శివార్లలోని సింఘు, టిక్రీల వద్ద జాతీయ రహదారులపైనే గత నెల రోజులుగా రైతులు చేస్తోన్న ఆందోళనలపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోందా.? అంటే అవుననక తప్పని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. నెల రోజులుగా యుములను కరిచే చలిలో రైతన్నలు తమ అవేదనను, కష్టాన్ని పంటికింగ బిగువ పట్టుకుని చేస్తున్న అందోళనపై కేంద్రం చర్చల పేరుతో తాత్సారం చేస్తోందే తప్ప.. ఎలాంటి క్రీయాశీలక మార్పులకు చేసేందుకు, రైతుల డిమాండ్లకు తలొగ్గడం లేదు.
దీంతో మరోమారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నదాతల అందోళనపై స్పందించారు. మరోమారు ఆయన తన పాత పరిష్కార మంత్రాన్నే ప్రస్తావించారు. అయితే రైతులను చులకన చేసేలా వారిపై విమర్శలు చేసేవారిపై మాత్రం ఆయన అసహనం వ్యక్తం చేశారు. రైతులు దేశానికి వెన్నెముక వంటి వారని కొనియాడారు. తాను కూడా రైతు బిడ్డనని, తన తల్లి, తండ్రీ ఇద్దరూ రైతులని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అన్నదాతలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని భరోసా ఇచ్చారు. అదే సమయంలో విపక్ష నేత రాహుల్ గాంధీ తమ ప్రభుత్వంపై సంధిస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు.
రాహుల్ గాంధీ పుట్టుకతోనే ధనవంతుడని, ఆయనకు రైతుల కష్టాలు తెలియవని విమర్శించారు. అయితే తాను ఒక రైతు బిడ్డనని, ఇక రాహుల్ కన్నా వయస్సులోనూ పెద్దవాడినని చప్పుకోచ్చిన రాజ్ నాథ్.. కుటుంబం నుంచి వ్యవసాయం గురించి, రైతన్నల గురించి తనకే ఎక్కువ తెలుసునని అన్నారు. ఆపై ప్రధాని మోదీజీ కూడా పేద కుటుంబంలో జన్మించిన కారణంగా ఆయనకు కష్టాల, నష్టాలు, రైతుల ఆక్రందనల గురించి ఎక్కువ అవగాహన ఉందని చెప్పుకోచ్చారు. కాబట్టే రైతులకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని చెప్పారు.
రైతు ప్రయోజనార్థం రూపొందించిన చట్టాలను రెండేళ్లపాటు అమలు చేయనివ్వాలని వారం రోజుల క్రితం చెప్పిన పరిష్కార మంత్రాన్నే ఆయన మరోమారు ఆలపించారు. రైతుల నిరసనతో ప్రభుత్వం తీవ్ర ఆవేదనకు గురవుతోందని చెప్పారు. ఉద్యమంలో పాల్గొంటున్న రైతులను నక్సల్స్, ఖలిస్థానీలు అంటూ ముద్ర వేయడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. వారిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక సంక్షోభం, ఇతర క్లిష్ట సమయాల్లో ఈ రైతు సోదరులే బాధ్యత తీసుకొని.. సమస్యల నుంచి గట్టెక్కించారంటూ వారి సేవలను కేంద్రమంత్రి రాజ్ నాథ్ కొనియాడారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more