అరబ్ దేశమైన యెమెన్ లోని ఏడెన్ విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల మొతమోగాయి. దేశంలో కొలువుదీరిన కొత్త క్యాబినెట్ ను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాద ముష్కరమూకలు పేట్రేగిపోయాయి. ఉగ్రవాదులు జరిపిన ఈ బీభత్సకాండలో ఏకంగా 26 మంది పౌరులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 50 మందికి గాయాలు అయ్యాయి. పేలుడుకు కారణాలు తెలియలేదు. ఇధిలావుండగా రంగంలోకి దిగిన భద్రతాదళాలు ప్రధాని సహా ఇతర క్యాబినెట్ మంత్రులను విమానాశ్రయం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇలా వారు సురక్షిత ప్రాంతం అనుకుని చేరుకున్న ప్యాలెస్ సమీపంలో మరో బాంబు పేలింది. దీంతో నూతన క్యాబినెట్ ను టార్గెట్ చేసుకునే బాంబు దాడులు జరుగాయని యెమెన్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రధాని, క్యాబినెట్ మంత్రులు వస్తున్న విమానం ల్యాండ్ అయిన తరువాత బాంబు పేలి ఉంటే పరిస్థితి అత్యంత ఘోరంగా ఉండేదని దేశ సమాచార శాఖ మంత్రి నగుబీ అల్ అవగ్ వ్యాఖ్యానించారు. ఇక ప్యాలెస్ వద్ద బాంబు పేలుడు ఘటనలో ప్రాణనష్టం జరుగలేదని అధికారులు వెల్లడంచారు.
ప్రస్తుతం విమానాశ్రయాన్ని సైన్యం తన అధీనంలోకి తీసుకుందని అల్ అవగ్ వెల్లడించారు. కాగా, ఈ పేలుళ్లను ఐక్యరాజ్య సమితి సహా పలు అరబ్ దేశాలు ఖండించాయి. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపాయి. 2014 నుంచి యెమెన్ లో పౌరయుద్ధం జరుగుతోంది. వేర్పాటువాదులు, ఇరాన్ ను బలపరుస్తున్న హౌతీ రెబెల్స్ మధ్య పట్టుకోసం పోరాటం సాగుతోంది. దేశంలో జరిగిన అంతర్యుద్ధం కారణంగా దాదాపు 1.12 లక్షల మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more