భాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా కొనసాగుతూ.. న్యాయస్థానంలో వున్న పెండింగ్ కేసుల విచారణకు గైర్హజరు అవుతున్న ప్రజాప్రతినిధులకు ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేసింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ ఎమ్మెల్యే ద్యాసం వినయ్ భాస్కర్ పై ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలెబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2012 నాటి కేసులో కోర్టు విచారణకు గైర్హాజరవుతూ వస్తున్న ఆయనపై ఈ మేరకు న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది.
ఆయనతోపాటు మరో 8 మంది ప్రజాప్రతినిధులకు కూడా ఎన్బీడబ్యూలు జారీ చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2012లో నమోదైన కేసులో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. తొమ్మిదేళ్లుగా విచారణ జరుగుతున్న ఈ కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న నేతలు న్యాయస్థానాలకు హాజరు కాకపోవడంతో వేచి చూసిన న్యాయస్థానం ఎట్టకేలకు ప్రజాప్రతినిధులై వుండి న్యాయస్థానంలో పెండింగ్ లో వన్న కేసుల విచారణకు గైర్హజరవుతున్న నేతలపై నాన్ బెయిలేబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం పతాకస్థాయిలోకి చేరిన నేపథ్యంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ పిలుపు మేరకు రైల్ రోకో కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించారు. అందులో భాగంగా వినయ్ భాస్కర్ సహా మరికొందరు ప్రజాప్రతినిధులు కాజీపేట రైల్వే స్టేషన్ లో రైలు రోకో కార్యక్రమం చేపట్టారు. దీంతో అప్పట్లో వీరిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. అయితే, ఈ కేసులో నిందితులుగా ఉన్నవారెవరూ విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు తాజాగా, వారందరికీ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more