అక్రమాస్థుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి వికే శశికళ.. కరోనా మహమ్మారి బారిన పడి చికిత్స పూర్తి చేసుకున్న నాలుగు రోజుల తరువాత క్రితం రోజున విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత అమె జయలలిత ట్రేడ్ మార్కుగా భావించే టోయోటా ప్రాడో వాహనంలో తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేసుకుంటూ తరలివెళ్లారు. కాగా, అమె తన కారుపై అన్నాడీఎంకే పార్టీ పతాకంతో వెళ్లడం తమిళనాడులో అధికార అన్నాడీఎంకే సహా అరవ రాజకీయాలలో ప్రకంపనలు రాజేసింది.
అసుపత్రి నుంచి నేరుగా తమిళనాడుకు వెళ్లకుండా బెంగళూరు శివార్లలోని ఓ ఖైరీదైన రిసార్టులోకి వెళ్లి సేద తీరుతున్నారు. అమె తమిళనాడులో ఎప్పుడు అడుగుపెట్టాలా అనే అంశంపై కూడా ఆసక్తికర వార్తలు వినిబడుతున్నాయి. తిరువన్ణామలైకి చెందిన ఓ జ్యోతిష్యుడి సూచన మేరకు అమె భవిష్యత్ నిర్ణయాలు తీసుకోనున్నారని.. ఆయన సూచించిన గడియల్లోనే అమె తమిళనాడుకు చేరుకుంటారని తెలుస్తోంది. అమె అడుగుపెట్టడంతోనే పార్టీ అధిపత్య పగ్గాలు కూడా అందుకునేలా పావులు కదిపేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.
ఇక తిరువణ్ణామళైకి చెందిన జోతిష్యుడు శశికళను ఈ నెల 3, 5, 8, 11 తేదీల్లోని ఏదో ఒక రోజున తమిళనాడులో అమెను అడుగుపెట్టాల్సిందిగా సూచించారని సమాచారం, దీంతో అమె ఆయన సూచించిన తేదీల్లో ఒక రోజు చెన్నై వెళతారని తెలుస్తోంది. ఈ తేదీల్లో వెళ్తే అంతా శుభం జరుగుతుందని జ్యోతిష్కుడు శశికళకు సూచించారట. ఆసుపత్రి నుంచి విడుదలయ్యాక బెంగళూరు లేదా హైదరాబాదులోని ఫామ్ హౌస్ లో ఆమె విశ్రాంతి తీసుకుంటారనే ప్రచారం నిన్నటివరకు జరిగింది. అయితే, ఇప్పుడామె కర్ణాటకలోని నందిహిల్స్ శివార్లలోని రిసార్ట్ కు వెళుతున్నట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more