Hyderabad Metro rushes with a heart to save a life! ప్రాణం కోసం పరుగులు పెట్టిన మెట్రో రైలు

Hyderabad metro rail creates green corridor to facilitate non stop transport of heart

Hyderabad heart transport metro, Hyderabad heart metro train, Hyderabad organ donation, Hyderabad metro, Kamineni Hospital, LB Nagar, KVB Reddy, Apollo Hospital, Metro rail green corridor, green Corridor, nagole to Jubiliee hills, Kamineni Hospital to apollo Hospital, Hyderabd metro, Telangana, Hyderabad news

Hyderabad Metro Rail created a special green corridor on Tuesday between Nagole and Jubilee Hills to facilitate the non-stop transport of a heart from Kamineni Hospital, LB Nagar to save a patient admitted at Apollo Hospital, Jubilee Hills.

గ్రీన్ కారిడార్: ప్రాణం కోసం పరుగులు పెట్టిన మెట్రో రైలు

Posted: 02/02/2021 05:58 PM IST
Hyderabad metro rail creates green corridor to facilitate non stop transport of heart

ప్రాణం కోసం మెట్రో రైలు పరుగులు పెట్టిందన్న శీర్షిక చూసి ఇదేమీటీ విచిత్రంగా వుందే అనుకుంటున్నారా.. కానీ ఇదే నిజం. మెట్రో రైలు యాజమాన్యం మానవత్వంతో స్పందించి గ్రీన్ కారిడార్ ఏర్పాటుకు ముందుకు వచ్చి ఓ వ్యక్తి జీవితాన్ని కాపాడింది. బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను ఎల్బీ నగర్‌ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి విజయవంతంగా తరలించడంతో మెట్రో సహకారం అద్వితీయం. నగరంలోని ట్రాపిక్ కోవిడ్ అన్ లాక్ తరువాత సర్వసాధారణ స్థాయికి వచ్చింది. ఎక్కడ చూసినా ట్రాఫిక్.. ట్రాఫిక్.

దీంతో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించి మరీ కేవలం నాలుగు గంటల వ్యవధిలో గుండెను అపోలో అసుపత్రిలోని పేషంట్ కు అమర్చాల్సి వుంది. దీంతో మెట్రో రైలు గ్రీన్ కారిడార్ ఏర్పాటుకు ముందుకువచ్చి.. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ వరకు ప్రత్యేక రైలును నడిపింది. దీంతో ఓ ప్రాణం నిలపడంలోనూ కీలక పాత్ర పోషించింది. ఇక అప్పటికే అక్కడ అపోలో అసుపత్రి అంబులెన్స్ సిద్దంగా వుండటంతో సకాలంలో వైద్యబృందం అసుపత్రికి చేరుకుని గుండెను రోగికి అమర్చి అతని ప్రాణాన్ని నిలబెట్టారు,

వివరాల్లోకి వెళ్తే.. నల్గొండకు చెందిన 45 ఏళ్ల రైతు నర్సిరెడ్డి బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో ఆయన గుండెను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. దీంతో గుండెను శస్త్రచికిత్స ద్వారా వేరొకరికి అమర్చేందుకు అపోలో వైద్యులు ఏర్పాట్లు చేశారు. గుండెను కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్‌ వరకు రోడ్డుమార్గంలో.. నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు మెట్రో రైలులో తీసుకెళ్లారు. తొలిసారిగా గ్రీన్‌ఛానల్‌ ద్వారా మెట్రో రైలులో గుండెను తరలించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ నుంచి అపోలో ఆస్పత్రి వరకు మళ్లీ రోడ్డుమార్గంలో తీసుకెళ్లారు. మరోవైపు జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు ఇప్పటికే వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్టర్‌ గోఖలే నేతృత్వంలో ఈ శస్త్ర చికిత్స జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles