RPF cop saves Challenged man from train mishap దివ్యాంగుడిని రైలు కింద పడకుండా కాపాడిన ఆర్పీఎఫ్ జవాను

Railway cop saves differently abled man from falling under train

Railway Protection Force, Panvel railway station, Panvel, RPF Constable, railway station, moving train, Board Moving Local Train, running train, Maharashtra, RPF personnel, differently-abled man, Running Train, Maharashtra, Crime

A Railway Protection Force (RPF) personnel on Friday saved life of a differently-abled man by preventing him from falling under a moving train at a railway station in Maharashtra's Panvel.

ITEMVIDEOS: దివ్యాంగుడిని రైలు కింద పడకుండా కాపాడిన ఆర్పీఎఫ్ జవాను

Posted: 02/06/2021 06:00 PM IST
Railway cop saves differently abled man from falling under train

ఓ రైల్వే పోలీసు సమయస్పూర్తి ఓ నిండు ప్రాణాన్ని బతికింది. అందులోనూ ఆయన కాపాడింది ఓ దివ్యాంగుడిని ప్రాణాపాయం అని తెలియగానే అయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. మ‌హారాష్ట్ర‌లోని పాన్వెల్ రైల్వే స్టేష‌న్ ఫ్లాట్ ఫాంపై ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రైలు నెమ్మదిగా కదులుతుండగా దానిన అందుకునేందుకు వచ్చిన దివ్యాంగుడు ప్రయత్నించాడు. అప్పటికే రైలు వేగాన్ని అందుకుంది. అయినా పట్టువదలని దివ్యాంగుడు పరుగెత్తి అలా రైలు హ్యాండిల్ ను పట్టుకున్నాడు.

కానీ అతని దేహం పూర్తిగా ఇంకా బయటే వేలాడుతోంది. ఒక్క చేత్తో తన కాలుకు ఆసరాగా వాడే కర్రను పట్టుకున్నాడు. మిగిలిన ఒక్క చేత్తో శరీరాన్ని హ్యాండిల్ కు తగిలేసినట్టుగా తగిలేసి.. బిగ్గరగా పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే తాను ఎక్కడ కిందపడతానో అన్న భయంతో అప్పటికే వణికుతున్నాడు. ఇదంతా చూస్తున్న అర్పీఎఫ్ కానిస్టేబుల్ వెంటనే మెరుపు వేగంతో పరుగెత్తి అలా రైలు డోర్ హ్యాండిల్ కు అనుకుని వున్న దివ్యాంగుడిని గట్టిగా బయటకు లాగి ఫ్లాట్ ఫామ్ పై పడుకోబెట్టాడు.

పూర్తిగా కిందపడ్డ దివ్యాంగుడు తేరుకుని తాను బతికే వున్నానని అనుకున్నాడు. కాగా అతని సంచి ఇత్యాదులు రైలులోనే వుండిపోగా.. ముందు స్టేషన్ అధికారులకు సమాచారం అందించి వాటిని తెప్పించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. వాటిని రైల్వే భద్రత సిబ్బంది తమ అధికార అర్పీఎఫ్ అకౌంట్ లో పోస్టు చేయగా ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. నెట్ జనులు అర్పీఎఫ్ కానిస్టేబుల్ చేసిన పనిని, ఆయన సమయస్పూర్తిని కోనియాడుతున్నారు.

{youtube}v=25GzIcky0bY

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles