Revanth starts padayatra from Yellikal ఎల్లికల్ నుంచి ప్రారంభమైన రేవంత్ పాదయాత్ర

Revanth reddy 140km pada yatra begins from yellikal in support of farmers

Revanth Reddy padayatra, Revanth padayatra from Yellikal, Acchampeta to Hyderabad, congress padayatra, sitakka, mallu Ravi, vamshi chander reddy, Congress, Revanth reddy, Rajiv Rythu Bharosa deeksha, Revanth reddy padayatra, Achampeta, Mahaboobnagar, Telangana, Politics

Congress working president and MP A Revanth Reddy begins his Rajiv Rythu Bharosa padayatra from Yellikal on fourth day in support of farmers. He launched a padayatra in protest against the new farm laws introduced by the Central government on sunday.

రైతు సమస్యలపై ఎల్లికల్ నుంచి ప్రారంభమైన రేవంత్ పాదయాత్ర

Posted: 02/10/2021 01:08 PM IST
Revanth reddy 140km pada yatra begins from yellikal in support of farmers

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నాలుగో రోజు కోనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నుంచి ఆదివారం ప్రారంభమైన ఆయన పాదయాత్ర.. ఇవాళ్టికి నాలుగో రోజు కొనసాగుతోంది. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలోని ఎల్లికల్ గ్రామం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. అచ్చంపేట రాజీవ్ రైతు భరోసా దీక్ష వేదికస్థలం నుంచి ఆయన పాదయాత్ర నిర్ణయం తీసుకుని నాలుగు రోజులుగా రాజీవ్‌ రైతు భరోసా పాదయాత్రను కోనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలోకి సరూర్ నగర్ వరకు ఆయన పాదయాత్ర కొనసాగనుంది.

ఎల్లికల్ నుంచి ఆయన తిమ్మారసిపల్లి, మీదుగా కల్వకుర్తికి చేరుకుంటారు. మార్గమధ్యంలో వచ్చిన గ్రామాల్లో రైతులను కలుసుకుని వారి పరిస్థితులను తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయన అటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే రైతుబంధుతో ఉపయోగం లేదని.. ఎరువుల ధరలు, అన్ని సరుకుల ధరలు బాగా పెరిగిపోయాయని విమర్శించారు. ఇక కేసీఆర్ ఆరుమాసాలకు ఓ పర్యాయం ఇచ్చే రైతు బంధు పథకం డబ్బును.. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్టుందని.. మధ్యం ధరలను విపరీతంగా పెంచి వాటికి ఆరింతలు ప్రభుత్వమే లాగేసుకుంటోందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ఇక కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులు ప్రభావం ఉత్తరాది రైతులలో స్పష్టంగా కనిపిస్తోందని.. ఆ విధానాలు అక్కడి నుంచి ఇక్కడకు కూడా వచ్చే ప్రమాదం వుందని.. ఈ క్రమంలో రైతలకు జాగృత అవసరమని అన్నారు. ఆ చట్టాలు అమలుతో రైతులు తమ పోలాల్లో తామే కూలీలుగా మారాల్సిన పరిస్థితులు వస్తాయని, ఈ చట్టాలను తెలంగాణ రైతంగం కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరముందని అన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రాస్తారోకోలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడెందుకు మిన్నకుండిపోయిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

నగర్ కర్నూల్ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజీవ్‌ రైతు భరోసా దీక్షలో పాల్గొన్న ఆయన.. రైతుల కోసం దీక్షలు కాదు పాదయాత్రలు చేయాలని మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి, ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు సూచించిన నేపథ్యంలో రేవంత్ అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చకుని పాదయాత్రను ప్రారంభించారు. ఈ మేరకు అదే వేదికపైనున్న రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. తాను అచ్చంపేట నుంచే హైదరాబాద్‌కు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఈమేరకు ఇవాళ నాలుగో రోజు పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles