Manasa Varanasi winner of Miss India World 2020 తెలంగాణ యువతి వశమైన ‘‘మిస్ ఇండియా 2020’’ టైటిల్

Telangana s manasa varanasi crowned vlcc femina miss india world 2020

Miss India, femina miss india 2021, Manasa Varanasi, Manika Sheokand, Manya Singh, Miss World Asia, Suman Rao, Neha Dhupia, Chitrangada Singh, Pulkit Samrat, Falguni, Shane Peacock, Colors TV, Fashion, Design

Manasa Varanasi, an engineer from Telangana, on Wednesday night emerged as the winner of VLCC Femina Miss India World 2020. While Haryana’s Manika Sheokand was declared VLCC Femina Miss Grand India 2020, Uttar Pradesh’s Manya Singh was crowned VLCC Femina Miss India 2020 - runner-up.

తెలంగాణ యువతి వశమైన ‘‘మిస్ ఇండియా 2020’’ టైటిల్

Posted: 02/11/2021 05:04 PM IST
Telangana s manasa varanasi crowned vlcc femina miss india world 2020

'మిస్‌ ఇండియా 2020' టైటిల్ తెలంగాణ యువతి వశమైంది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ పోటీలో ఏకంగా 31 మంది ఫైనలిస్టుల నుంచి మిస్ ఇండియా కిరీటాన్నీ దక్కించుకుంది. 23 ఏళ్ల యువ ఇంజనీర్‌ మానస వారణాసి వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 కిరీటాన్ని సోంతం చేసుకుంది. అద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ షోలో చివరగా నిలిచిన ముగ్గురు ఫైనలిస్ట్ లలో తెలంగాణకు చెందిన మానసను న్యాయనిర్ణేతలు మిస్ ఇండియా వరల్డ్ గా ఎంపిక చేశారు.

హైదరాబాద్ కు చెందిన మానస గ్లోబల్ ఇండియన్ స్కూల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. వాసవి ఇంజనీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆమె ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‏ఛేంజ్ అనలిస్ట్‏గా పనిచేస్తోంది. 2021లో జరగబోయే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పాల్గొననుంది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీలో మొత్తం 31 మంది ఫైనలిస్టులను ఎంపిక చేయగా, అందులోంచి మానస టైటిల్ ను దక్కించుకుంది.

ముంబైలో నిర్వహించిన ఫైనల్‌ పోటీలో హర్యానాకు చెందిన మణికా షియోకాండ్ మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2020 కాగా, యూపీకి చెందిన మన్యసింగ్‌ మిస్‌ ఇండియా 2020 రన్నరప్‌లుగా నిలిచారు. మిస్ ఇండియా జ్యూరీ ప్యానెల్‌లో సినీ నటులునేహా ధూపియా, చిత్రంగడ సింగ్, పుల్కిత్ సామ్రాట్, ప్రఖ్యాత డిజైనర్  ఫాల్గుని మరియు షేన్ పీకాక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మొదటి రౌండ్‌కు మిస్ వరల్డ్ ఆసియా 2019 సుమన్ రావు నాయకత్వం వహించారు. ఈ పోటీకి సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఈ నెల 28న కలర్స్ టీవీ చాన‌ల్‌లో ప్రసారం కానుంది.

 
 
 
View this post on Instagram

A post shared by Femina Miss India (@missindiaorg)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles