దేశంలో నేరాలు, ఘోరాలు నానాటికి పెరుగుతున్నాయి. తన ప్రత్యర్థులను ఎదుర్కోనే విషయంలో చతికిలపడుతున్న వారు.. వారిని నేరుగా ఎదుర్కోనలేక.. దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ కార్మిక శాఖ మంత్రి జాకీర్ హుస్సేన్‌పై గుర్తు తెలియని అగంతకులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఆయతో పాటు వున్నవారిలో ఇద్దరు మాత్రం అసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కోల్ కతా నగరానికి వచ్చేందకు మంత్రి జాకీర్ హుస్సేన్ క్రితం రోజు రాత్రి 10 గంటల సమయంలో ముర్షిదాబాద్ జిల్లాలోని రఘునాథ్ గంజ్ పరిధిలోని నిమ్తితా రైల్వే స్టేషన్ లోకి చేరుకున్నారు. పలువురు అనుచరులు వెంటరావడంతో ఆయన తన ఫ్లాట్ ఫామ్ వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని అగంతకలు ఆయనను టార్గెట్ చేసి నాటుబాంబులు విసిరారు. ఈ ఘటనలో ఒక్కసారిగా పెద్ద శబ్దాలతో విస్పోటనం చోటుచేసుకుంది.
బాంబు పేలుళ్లతో రైల్వే స్టేషన్ దద్దరిల్లింది. విస్పోటనం ధాటికి ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది భయంతో పరుగులు తీశారు. కాగా తేరుకున్న తరువాత మంత్రి జాకీర్ హుస్సెన్ ఎక్కడా.. అని చూసిన రైల్వే సిబ్బందికి ఆయన రక్తపు మడుగులో చిక్కుకున్నారని చూపి హుటాహుటిన అసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మంత్రిని జంగీపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసిన తరువాత కోల్ కతా నగరానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మంత్రితోపాటు ఉన్న మరో ఇద్దరు గాయపడగా వారు చికిత్స పోందుతూ మరణించారు. మంత్రి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
#LiveVisuals| Crude bombs hurled at Bengal Minister zakir Hussain in Raghunathganj in Murshidabad...., Minister Zakir Seriously Injured, two dead more reports awaiting.#Bengal pic.twitter.com/ia9wUMMedY
— AIMIM Kochadhaman Assembly (@AKochadhaman) February 17, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more