తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన న్యాయవాద దంపతుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తెలంగాణ పోలీస్ శాఖ పనితీరునే ప్రశ్నించేలా వున్న మరో ఆడియో వెలుగుచూసింది. ఈ కేసు విషయంలో పోలీసుల నిర్లిప్తత ఎంతలా వుందో స్పష్టం చేసేలా.. ఆ నిర్లక్ష్యమే న్యాయవాదుల ప్రాణాలను హరించేలా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఆడియో టేపులో హుతురాలైన న్యాయవాది పివీ నాగమణితో మాట్లాడిన పోలీసు అధికారి వ్యవహారశైలిపై కూడా పలు విమర్శలు వస్తున్నాయి.
గుంజపడుగు రామాలయం విషయంలో తమకు రక్షణ కల్పించాలని న్యాయవాది నాగమణి డీసీపీ రవీందర్ ను కోరిన ఆడియో కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి ఈ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుంజపడుగు గ్రామంలోని ఆలయం విషయంలో కుంట శ్రీనివాస్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తమకు రక్షణ కల్పించాలని నాగమణి డీసీపీని కోరారు. ఈ విషయంలో స్థానిక పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోవడం లేదని, ఎస్సై తమ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, మీరైనా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, డీసీపీ రవీందర్ ఆమెకు రక్షణ విషయం కల్పించే విషయాన్ని పదే పదే దాటవేస్తూ.. ప్రతీది పోలీసుల పరిధిలోకి రాదని, ఆలయానికి సంబంధించిన గ్రామ సర్పంచ్ చర్యలు తీసుకుంటారని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో సర్పంచ్ తో సమస్య పరిష్కారం కాని పక్షంలో దానిపై జిల్లా అధఇకారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతీదానికి పోలీసుల శాఖను జోక్యం చేసుకోవాలని కోరడంలో అర్థం లేదని చెప్పిన ఆయనకు అడ్డుతగులుతూ.. రక్షణ కల్పించాలని చెప్పినా పట్టించుకోని.. స్వయంగా గ్రామ సర్పంచ్ పోలీసులకు పిర్యాదు చేసినా.. చర్యలు తీసుకున్న నాథుడే కరువయ్యాడని అమె ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
సర్పంచ్ నేతృత్వంలోని ఆలయ కమిటీ రామాలయ పర్యవేక్షణ వ్యవహారాలను చూసుకుంటుందని చెప్పినా.. కుంట శ్రీను అనే వ్యక్తి సుమారు 50 నుంచి 60 మందితో వచ్చి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని అమె పిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరినా పోలీసులు చర్యలు తీసుకోలేదని అరోపించారు. ఇక ఆలయకమిటీ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరినా పోలీసు అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని అమె అవేదన వ్యక్తం చేశారు. దీంతో రామాలయానికి రక్షణ కల్పించడం దేశంలోనే ఎక్కడ జరగదని పోలీసు అధికారి అమెతో అన్నారు. అయితే రక్షణ కల్పించాలంటూ న్యాయవాద దంపతులు తమను ఎప్పుడూ సంప్రదించలేదని గురువారం పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో నాగమణి స్వయంగా డీసీపీ రవిందర్ ను రక్షణ కోరిన ఆడియో క్లిప్పింగ్ ప్రస్తుతం నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more