Fake Woman IPS officer cheats business man in Bachupally నకిలీ మహిళా ఐపీఎస్ అధికారి.. పెళ్లి పేరుతో కుచ్చుటోపి..

Bachupally man cheated of 11 crores by fake female ips officer

business man cheated of 11 crores, Bachupally businessman cheated of 11 crores, fake IPS officer shruthi sinha cheats businessman, pseudo IPS officer, Dehradun, Shruthi sinha, VeeraReddy, business man, bachupally, marriage, fake female IPS officer, Rangareddy, Crime

Hyderabad Police have arrested a lady gang who cheated a businessman to the tune of Rs 11 crores. According to the reports, in the guise of a fake IPS officer, the lady took a Bachupally businessman into her confidence, stating that her sister will marry the brother of a businessman.

నకిలీ మహిళా ఐపీఎస్ అధికారి.. పెళ్లి పేరుతో కుచ్చుటోపి..

Posted: 02/24/2021 07:40 PM IST
Bachupally man cheated of 11 crores by fake female ips officer

పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా దగా అంటూ ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా.. ఆశ అన్నది అత్యాశగా మారిన మనిషి మోసపోక తప్పదు.. కొత్త కో్త పథకాలతో మోసం చేసేవాళ్లకు మన రాష్ట్రంలో కొదవేలేదు. రాయి కూడా వెలుతురు పడితే మెరుస్తుందని తెలిసినా.. అది వజ్రం కాదన్న విషయం మాత్రం తెలుసుకోవడంలో మనిషి నిర్లక్ష్యం వహిస్తున్నాడు. అయితే అదే డాబు, ఎదుటి వారి ఆశ, నిర్లక్ష్యాలనే పెట్టుబడులుగా పెట్టుకునే మోసగాళ్లు మాత్రం అందినకాడికి దండుకుని శఠగోపం పెట్టి వెళ్తుంటారు.

సరిగ్గా ఇలానే జరిగింది. సినీఫక్కీలో తాను ఐపీఎస్ ఆఫీసర్ అంటూ.. డెహ్రాడూన్ లో ట్రైనింగ్ లో వున్నానంటూ.. ఇక జాతీయ మానవహక్కుల కమీషన్ చైర్ పర్సన్ అంటూ నోటికి వచ్చిన మాటలు చెప్పిన ఓ మాయలేడి.. నాటకాలను ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టారు. అమెకు అరదండాలు వేయడంతో ప్రస్తుతం అమె కటకటాల్లో ఊచలు లెక్కపెడుతోంది. అమెతో పాటు వ్యాపారస్థుడిని మోసం చేయడంలో సహకరించిన మరో ముగ్గుర్ని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..హైదరాబాద్‌ బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జల్సాలకు అలవాటు పడిన శ్రుతి సిన్హా అనే మహిళ తన భర్తను వదిలేసి.. ఇద్దరు పిల్లలను కూడా కాదనుకుని మోసాలకు తెగబడింది. నకిలీ ఐపీఎస్‌ అధికారి అవతారమెత్తింది. వీరారెడ్డి అనే వ్యాపారి తమ్ముడికి తన చెల్లితో వివాహం చేసుకుందామని మాట కలపడంతో ఉబ్బితబ్బిబయిన వీరారెడ్డి పోలీసు ఐపీఎస్ అధికారి సంబంధం వస్తుందని ఎంతో సంబరపడ్డాడు. తాము కూడా సంపన్న కుటుంబం నుంచి చెందినవారమేనని.. నమ్మించగలిగింది.

ఇక ఈ క్రమంలో వీరారెడ్డి నుంచి తమ డబ్బు కొంత జామ్ అయ్యిందని.. తమకు డబ్బును అడ్జెస్ట్ చేయాలని కోరడంతో వీరారెడ్డి కూడా వెనకాముందు ఆలోచించకుండా అమెకు ఏకంగా పలు విడదలుగా ఏకంగా రూ.11 కోట్లు తీసుకుంది. ఇలా డబ్బును తీసుకున్న తరువాత అమె కాంట్రాక్టులోకి రాకపోవడంతో వీరారెడ్డి అమె గురించి కూపీ లాగడం ప్రారంభించాడు. దీంతో కొద్ది రోజుల తర్వాత అసలు విషయం తెలుసి నాలుకు కర్చుకుని పోలీసులను అశ్రయించారు. కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు శ్రుతి సిన్హాతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి రూ.6కోట్ల విలువైన ఆస్తులు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఖరీదైన కార్లు, విల్లా స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles