Congress demands CBI probe in lawyers Murder case న్యాయవాదుల హత్యకేసులో సీబిఐ విచారణ: గవర్నర్ ను కోరిన కాంగ్రెస్

Lawyer couple murder congress meets telangana governor demands cbi enquiry

Uttam Kumar Reddy, TPCC, congress, Tamilasai Soudaryarajan, PV Nagamani Audio Tape, Akkapaka Kumar, Bittu Srinu, Murder, Lawyer Couple, Telangana High Court, Chief Justice Telangana High court, Justices Hima Kohli, HIgh Court Division Bench, Justice B. Vijaysen Reddy, Gattu Vaman Rao, PV Nagamani, Manthani, Ramagundam Police, Telangana, crime

Congress leaders led by TPCC president Uttam Kumar Reddy met Governor Dr Tamilisai Soundararajan on Friday and demanded a fair probe into the murders of advocates Gattu Vaman Rao and PV Nagamani, who were killed in broad daylight in Telangana's Peddapalli district last week.

న్యాయవాదుల హత్యకేసులో సీబిఐ విచారణ: గవర్నర్ ను కోరిన కాంగ్రెస్

Posted: 02/26/2021 03:43 PM IST
Lawyer couple murder congress meets telangana governor demands cbi enquiry

తెలుగురాష్ట్రాల్లో పెనుసంచలనంగా మారిన న్యాయవాద దంపతుల దారుణ హత్యకేసులో కీలక నిందితులను తప్పించారని కాంగ్రెస్ నేతలు రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టపగలు రాహదారిపై అత్యంత పాశవికంగా న్యాయవాద దంపతుల హత్యలకు పాల్పడటానికి అసలు కారణం ఇసుక మాఫియా అని, దీనిని అడ్డగోలుగా నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నేతలు, పోలీసులు సంయుక్తంగా కలసి వారి హత్యలకు కారకులయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అరోపించారు. ఈ కేసులో అసలైన నిజాలు వెలుగు చూడాలంటే కేసు దర్యాప్తును సీబిఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యాయవాద దంపతుల హత్య రాష్ట్ర చరిత్రలోనే అత్యంత కిరాతకమైన ఘటనగా పేర్కోన్న ఉత్తమ్ ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిందని అన్నారు. ఈ ఘటనలో నిజానిజాలు వెలుగుచూడాలన్నా.. హత్యల వెనుక ముఖ్యోద్దేశం బయటకు రావాలన్నా సిబీఐ విచారణ అత్యంత అవసరమని అన్నారు. న్యాయవాద దంపతులు హత్యకేసులో పోలీసులు, అధికార పార్టీ నేతల పాత్ర వుందని ప్రజలు నమ్ముతున్నారని, ఈ క్రమంలో నిష్పాక్షపాత్ర దర్యాప్తు జరగాలంటే కేసును సీబిఐ చేత విచారణ జరిపించడం ఒక్కటే మార్గమని ఆయన అన్నారు.

ఈ విషయమై రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ను కలసి హత్యోదంతంపై విషదీకరించగా, అమె సానుకూలంగా స్పందించారని, సీబిఐ చేత విచారణకు జరిపించేందుకు ప్రయత్నిస్తానని అన్నారని ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులతో కలసి ఆయన గవర్నర్ ను కలిపారు. టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు, అన్యాయాలకు అడ్డుగా నిలచి.. పోరాడటంతోనే న్యాయవాది గట్టు వామన్ రావు, పివీ నాగమణిల హత్యలు జరిగాయని ఆయన అరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిసరాల నుంచి రూ. 4 వేల కోట్ల రూపాయల ఇసుక అక్రమంగా తరలివెళ్లిందని, దీనిపై పోరాటం చేస్తుండటం కారణంగా వారిని పథకం ప్రకారం హత్య చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

శీలం రంగయ్య అనే వ్యక్తి లాకప్ డెత్ కేసులో వామన్ రావు దంపతులు హైకోర్టులో కేసులు వేయడంతో పోలీసులు కూడా వీరిపై కక్షగట్టారని.. నాగమణి తమకు రక్షణ కల్పించాలని డీసీపీ రవిందర్ ను స్వయంగా ఫోన్ లో కోరినా.. వారి నుంచి రక్షణ కావాలని ఎలాంటి వినతులు రాలేదని పోలీసు అధికారులు స్పష్టం చేయడం ఆ తరువాత అడియో రికార్డింగ్ లిక్ కావడం తెలిసిన విషయమేనని అన్నారు. ఇక పుట్ట లింగమ్మ చారిటెబుల్ ట్రస్టు అక్రమంగా సేకరణలపై పోరాడటంపై కూడా అధికార పార్టీ నేతలు ఆయనపై పగబట్టి పథకం ప్రకారమే హత్యచేశారని ఉత్తమ్ కుమార్ అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles