Revanth Reddy slams CM KCR on Ekashila park ‘త్యాగాల చరిత్రకు భోగాల చెద’ కేసీఆర్ పై రేవంత్ ధ్వజం

Revanth reddy slams cm kcr on ekashila park sculptures

Revanth Reddy fires on TRS government, Revanth reddy slams KCR government, Revanth reddy on Ekashila Park, Revanth Reddy on professor Jayashankar sir, Congress, Revanth reddy, kothapally JayaShankar, Professot Jayashankar, Ekashila Park, Hanmakonda, CM KCR, KTR, martyrs, Telangana, Politics

Congress working president A Revanth Reddy fires on Ruling TRS government says, CM KCR and his government trying to change the History of Telangana Movement. The Malkajgiri MP says it is an insult to entire Telanganites as so many martyrs has laid foundation to seperate Telangana state.

ITEMVIDEOS: ‘త్యాగాల చరిత్రకు భోగాల చెద’ కేసీఆర్ పై రేవంత్ ధ్వజం

Posted: 02/27/2021 10:36 AM IST
Revanth reddy slams cm kcr on ekashila park sculptures

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వంపై మరోమారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరుల త్యాగాల మీద అడుగులు వేసుకుంటూ అధికారాన్ని చేపట్టిన కేసీఆర్.. తెలంగాణ అంటే తానొక్కడే అన్న చరిత్రను మార్చే క్రమానికి శ్రీకారం చుట్టారని రేవంత్ దుయ్యబట్టారు. భవిష్యత్తులో భావితరాలకు తెలంగాణ తొలి ఉధ్యమం, అమరవీరుల గురించి తెలియకుండా నిజమైన చరిత్రకు చెదలు పట్టించే కార్యక్రమాలకు ప్రభుత్వం చేపట్టిందని విమర్శలు సంధించారు. ఈ క్రమంలో భాగంగానే ఆయన పార్టీశ్రేణులు ఆయనను తెలంగాణ జాతిపితగా అభివర్ణిస్తున్నారని మండిపడ్డారు.

ఇక తాజాగా ఆయన ప్రభుత్వం చేపట్టిన ప్రతీ పనిని ఏళ్లుగా కొనసాగించడంలోనూ అంతరార్థం అదేనని విమర్శించారు. ఏళ్ల సమయం పట్టే భారీ పనులు.. కమీషన్ల కోసం నెలల్లోనే పూర్తి చేసి.. నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సిన పనులను ఏళ్లు గడుస్తున్నా పూర్తికానీయకుండా అడ్డుపడుతూ.. చరిత్రను మార్చే చౌకబారు యత్నాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని అన్నారు. హన్మకొండ ఏకశిల పార్కును తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్మృతివనంగా మార్చాలని నిర్ణయం తీసుకుని ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పనులు పూర్తి కాలేదని అన్నారు.

2016లో ఇందుకు సంబంధించిన‌ పనులు ప్రారంభించారని.. కాగా ఇప్ప‌టికీ ఆ ప‌నులు ఇంకా ఆ పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయన్నారు. అందులో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ బొమ్మ‌ల‌ను పెట్ట‌డానికే అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారంటూ ఓ దిన‌ప‌త్రిక‌లో 'జయశంకర్‍ సార్ స్మృతివనంలో కేసీఆర్‍ జ్ఞాపకాలు' పేరిట వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలంగాణ‌ ఉద్యమానికి జయశంకర్ చేసిన సేవలను గుర్తు చేసుకోవాల్సిన చోట ఆయన కంటే సీఎం కేసీఆరే ఎక్కువగా కనిపించేలా బొమ్మలు పెట్టారని అందులో ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు.

తెలంగాణ‌ పోరాటాన్ని పక్కనపెట్టేసి కేసీఆర్ దిక్షాదివస్ లో నిమ్మరసం తాగే చిత్రాన్ని పెట్టార‌ని చెప్పారు. జయశంకర్ తో ఎప్పుడూ వేదికన పంచుకోని మంత్రి కేటీఆర్ చిత్రాన్ని కూడా స్మృతివనంలో ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఉద్యమ ఘట్టాలకు సంబంధించిన చిత్రాల్లో జయశంకర్ కంటే సీఎం కేసీఆర్ బొమ్మలే పెద్దగా పెట్టారని అందులో పేర్కొన్నారు. వీటిని రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. 'త్యాగాల చరిత్రకు భోగాల చెద! స్వరాష్ట్రం కోసం ప్రాణం ఒదిలినోళ్లు, ప్రాణం పెట్టినోళ్ల చరిత్ర చిన్నబోతోంది. ఇది ఉద్యమ మార్గదర్శి జయశంకర్ ‘సారు’ ఒక్కడికే జరిగిన పరాభవం కాదు.. రాష్ట్రమే కాంక్షగా... ఉద్యమమే శ్వాసగా బతికిన ప్రతి తెలంగాణ బిడ్డకు జరిగిన అవమానం. ఎవని పాలయిందిరో తెలంగాణ...?' అని రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles