తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి దారుణ హత్యకేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించాయి. హత్యకు నిందితులు ఉపయోగించిన రెండు కత్తులు సుందిళ్ల బ్యారేజ్‌లో దొరికాయి. బ్యారేజ్ 53, 54 పిల్లర్ల వద్దరెండు కత్తులను గజఈతగాళ్లు వెలికి తీశారు. కాగా కత్తుల కోసం పోలీసులు రెండు రోజులు వేట కొనసాగించగా సోమవారం వీరి ప్రయత్రం ఫలించింది. ఆదివారం రోజు సాయంత్రం వారకు సుందిళ్ల బ్యారేజీలో కత్తుల కోసం గాలించిన పోలీసులు, గజ ఈతగాళ్లు.. రెండో రోజు కూడా గాలింపు చర్యలు చేపట్టారు.
సోమవారం ఉదయం సుందిళ్ల పార్వతి బ్యారేజ్ వద్దకు ఇద్దరు నిందితులను పోలీసులు తీసుకొచ్చారు. అయితే హత్యకు ఉపయోగించిన కత్తులను సుందిళ్ల బ్యారేజీలో 59 పిల్లర్ వద్ద పడేశామని గురువారం నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి చెప్పగా ఇవాళ 45వ పిల్లర్ నుంచి 60వ పిల్లర్ వరకు మధ్యలో పడేశామని మాట మార్చారు. దీంతో కేసులో కత్తులు కీలకంగా మారడంతో పోలీసులు సవాల్‌గా స్వీకరించారు. ఈ క్రమంలో రెండు కత్తుల కోసం అయిదుగరు గజ ఈతగాళ్లతోపాటు 50 మంది పోలీసులు గాలించారు.
మరోవైపు ఇవాళ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో న్యాయవాద దంపతుల దారుణ హత్యలపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఘటనకు సంబంధించిన సీసీ పూటేజీలు, వీడియో రికార్డింగులు స్వాధీనం చేసుకున్నారా.? అని పోలీసులను ప్రశ్నించింది. ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న బస్సులోని ప్రయాణికులను గుర్తించారా? అని అడిగింది. వీటికి సమాధానమిచ్చిన అడ్వొకేట్ జనరల్ ప్రయాణికులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ఎదుట ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది.
ఇద్దరి వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ నెల 4న వామన్‌రావు తండ్రి వాంగ్మూలం నమోదు చేస్తామని వివరించారు. మిగతా సాక్షుల వాంగ్మూలాలు ఎందుకు నమోదు చేయలేదని కోర్టు ప్రశ్నించగా.. ఇందుకు సంబంధించిన అనుమతిని ఇవాళే మేజిస్ట్రేట్‌ను కోరతామన్నారు. తదుపరి విచారణలో వివరాలు సమర్పిస్తాని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు గల నెల 24 వరకు జరిగిన దర్యాప్తు వివరాలను కోర్టుకు సమర్పించారు. దర్యాప్తుస్థాయి నివేదికను పోలీసులు సీల్డ్ కవర్లో అందజేశారు. నలుగురు నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more