మహిళలపై నేరాల విషయంలో గత ఏడాది అగ్రస్థానంలో నిలిచిన ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. తన 17 సంవత్సరాల కుమార్తె తల నరికిన ఓ తండ్రి, ఆ తలను చేత్తో పట్టుకుని నడి వీధుల్లో తిరగడం తీవ్ర కలకలం రేపింది. స్థానికులు అందించిన సమాచారంతో ఇద్దరు పోలీసులు అతడ్ని వెతుక్కుంటూ వచ్చి అరెస్టు చేశారు. పోలీసులు, స్థానికులు వెల్లడించిన సమాచారం ప్రకారం, లక్నోకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండితారా గ్రామానికి చెందిన సర్వేశ్ కుమార్ అనే వ్యక్తి తన సొంత కూతుర్ని హత్య చేసి అమె తలను తన చేత్తో పట్టుకుని గ్రామంలోని వీధులగుండా నడిచాడు.
ఇది గమనించిన గ్రామస్తులు సర్వేశ్ కుమార్ ఇలా ఓ యువతి తలను నరికి తీసుకెళ్తున్నడని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆయన్ను వెతుక్కుంటూ వచ్చిన పోలీసులు, మార్గమధ్యంలో ఆయను నిలిపి.. ఏంటీ ఇది ఇలా ఎందుకు తిరుగుతున్నావ్.. చేతిలోని తల ఎవరిదీ అని ప్రశ్నించారు. అయితే పోలీసుల అడిగిన ప్రశ్నలకు ఎలాంటి తడబాటు లేకుండా సర్వేశ్ కుమార్ సమాధానాలు చెప్పారు. ఇక తలను కింద పెట్టమని చెప్పిన పోలీసులు.. అతడ్ని కింద కూర్చోమని చెప్పారు. దాంతో అలాగే చేశాడు సర్వేశ్ కుమార్.
తన చేతిలోని తల తన కుమార్తే అని సర్వేశ్ కుమార్ ఎలాంటి సంకోఛం లేకుండా ఫోలీసులకు తెలిపాడు. అమెను తాను మాత్రమే పదునైన ఆయుధంతో నరికి చంపానని చెప్పానని సర్వేశ్ పోలీసులకు తెలిపాడు. అయితే ఎందుకు చంపాల్సి వచ్చిందని పోలీసులు అడిగిన ప్రశ్నకు కూడా ఆన సమాధానం ఇచ్చాడు. తన కుమార్తె పరాయి వ్యక్తితో సంబంధం ఏర్పర్చుకుందని.. దానిని చూసి తాను తట్టుకోలేకపోయానని, అందుచేతే అమెను నరికి చంపానని చెప్పాడు. తలను మాత్రమే తీసుకువచ్చిన తాను మిగతా శరీర భాగం మొత్తం ఇంట్లోనే వుందని తెలిపాడు.
తమకు, సర్వేశ్ కుమార్ కు మధ్య జరిగిన సంభాషణను పోలీసులు వీడియో తీశారు. పెళ్లి కానీ తన కుతూరు.. మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే తాను హత్య చేశానని అన్నాడు. ఈ ఘటనపై హర్దోయ్ పోలిస్ స్టేషన్ అధికారి కపిల్ దియో సింగ్ మాట్లాడుతూ నిందితుడ్ని తాము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. కాగా ఒక పోలీసు సిబ్బంది మృతురాలి తలను అవమానించేలా పట్టుకున్నందుకు గాను సదరు సిబ్బందిని సస్పెండ్ చేశామని తెలిపారు. ఈ మేరకు వైరల్ అయిన ఓ ఫోటోపై తమ శాఖ ఉన్నతాధికారులు వేగంగా స్పందించారని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more