ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో మరోమారు వార్తల్లో నిలిచింది. మనుషుల క్షుద్భాధను తీర్చే ఈ యాప్.. డెలివరీ బాయిస్ కారణంగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ఆ మధ్య ఓ జోమాటో డెలివరీ బాయ్.. పార్శిల్ ను తీసి అందులోని ఆహారాన్ని కొద్దిగా లాగించేసి మళ్లీ తనకు ఏమీ తెలియనట్టు ప్యాక్ చేసి టేపుతో సీల్ వేసిన వీడియో ఒకటి నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ తరువాత పోస్ట్ కరోనా సీజన్ లో బయటి ఆహారం తెప్పించుకునే వారి సంఖ్య తగ్గిపోయి.. ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిన పడుతున్న క్రమంలో జోమాటో డెలివరీ బాయిస్ కు వర్క్ అధికమైయ్యింది.
దీంతో ఒక్కో డెలివరీ బాయ్ ఏకంగా ఒక్క టిప్పులోనే రెండు నుంచి మూడేసీ అర్డర్లును డెలివరీ చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన వారు గంటకు పైగా తమ అర్ఢర్ కోసం వేచి చూడాల్సి వస్తుంది. మంచి ఆకలి మీదన్న వ్యక్తులు అర్డర్ ఇస్తే.. ఆకలి చచ్చిపోయిన తరువాత కానీ అర్ఢర్ రావడం లేదు. దీనికి కారణాలు ఆ సంస్థ యాజమాన్యాలకే తెలియాలి. ఈ విషయం అటుంచితే.. లేటుగా వచ్చావేంటి అని కసురుకుంటే.. ఒక ట్రిప్పుకు మూడు ఆర్డర్లు డెలివరీ చేస్తూ.. రెండు మూడు అపార్టుమెంట్లు ఎక్కి దిగుతూ.. ఆ వచ్చిన కోపం అంతా మనపైనే చూపించేందుకు రెడీ వుంటారు డెలివరీ బాయిస్.
ఏం చేస్తారు చాలీచాలని జీతాల కోసం.. శ్రమించడంతో పాటు ట్రాపిక్ సమస్యలను కూడా ఎదుర్కోంటూ మనకు అర్డర్లను అందివ్వాలి కదా.. అయితే ఆర్డర్ రాలేదని కాన్సిల్ చేసుకుంటే కంపెనీ వారికిచ్చే కమీషన్లో కొత విధిస్తుందో ఏమో తిలియదు కానీ.. ఆలస్యమైన కారణంగా కాన్సిల్ అనగానే డెలివరీ బాయిస్ చాలా భాధకు గురవుతురు. ఇలాటి అర్గరడ్ ను కాన్సిల్ చేసిన ఓ యువతిపై డెలివరీ బాయ్ పిడిగుద్దులు గుద్ది మరీ వెళ్లాడు. ఔనా.? అయితే అంతకుముందు ఇద్దరకీ మధ్య కొంత వాగ్యుద్దం కూడా జరిగిందని తెలుస్తోంది. ఇంకేముంది బాధితురాలు తన అవేదనను వ్యక్తం చేస్తూ నెట్టింట్లో పోస్టు పెట్టింది.
వివరాల్లోకి వెళితే.. మార్చి 9 న మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్డర్ ఇవ్వగా.. గంట సమయం పడుతుందని అంచనా సమయం తెలపింది. అయితే గంట గడిచినా అర్డర్ అందలేదు. దీంతో ఆర్డర్ ఆలస్యం కావడంపై కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడి, తన ఆర్డర్ క్యాన్సిల్ చేయాలని బెంగళూరుకు చెందిన కంటెంట్ సృష్టికర్త మేకప్ ఆర్టిస్ట్ హితేషా కోరింది. ఇంతలోనే డెలివరీ బాయ్ ఆర్డర్ తెచ్చాడు. ఇంత ఆతస్యమేంటీ అంటూ డెలివరీ బాయ్ పై హితేషా మండిపడింది. దీంతో డెలివరీ బాయ్ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై పిడిగుద్దుల గుద్దాడు. తరువాత తన ఆర్డర్‌ను తీసుకొని మరీ పారిపోయాడని ఆమె తెలిపారు. దీనికి సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేశారు. జొమాటో సేవలు సురక్షితమేనా అంటూ వాపోయారు. దయచేసి తనకు మద్దతుగా నిలవాలంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more