రాష్ట్రంలో 2017లో డ్రగ్స్ కేసు వివాదం రేగిన నేపథ్యంలో అందులో తన పేరు పోందుపర్చుకున్న హీరో తాజాగా కర్ణాటక పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. కర్ణాటకలో ఇటీవల కలకలం రేపిన డ్రగ్స్ కేసులో విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు సినీప్రముఖులు అరెస్టై బెయిల్ పై కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ తీసుకుంటున్న వారిని మానసిక రోగులుగా పరిగణించి వదిలివేయగా.. డ్రగ్స్ అమ్ముతున్నవారిపై మాత్రం కొరడా ఝుళిపించింది. దీంతో రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మాకాలు కాసింత తగ్గుముఖం పట్టాయి.
అయితే డ్రగ్స్ అలావాటు వున్న బాడాబాబులు వీటికి అలవాటు పడి ఎక్కడ లభిస్తే అక్కడికి వెళ్లి వీటిని కొనుగోలు చేస్తున్నారు. తద్వారా వాటిని అస్వాదిస్తున్నారు. అయితే ఈ వ్యవహరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్ణాటక పోలీసులు తమకు లభించిన డ్రగ్స్ రాకెట్ సూత్రధారులైన అఫ్రికా దేశస్థులను అరెస్టు చేసి.. వాటి నుంచి రాబట్టిన సమాచారం మేరకు అరెస్టుల పర్వాలను కొనసాగిస్తున్నారు. వీరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి.. పలువురికి విక్రయిస్తున్న కన్నడ నాట మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మస్తాన్ చంద్రా అని తెలుసుకున్న పోలీసులు అతడితో పాటు అతని అనుచరులను కూడా అరెస్టు చేసి.. వారి విచారణలో వెల్లడించిన వివరాలతో పాటు వారి ఫోన్ నెంబర్లు, లాప్ టాప్ ల ఆధారంగా అరెస్టులను కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో శాండిల్ వుడ్ ప్రోడ్యూసర్ సహా పలువురిని ఇళ్లపై దాడులు చేసిన పోలీసులకు వారిళ్లలో ఏలాంటి డ్రగ్స్ లభ్యం కాకపోవడంతో అరెస్టులు చేయలేదు. అయితే తమకు అందిన సమాచారం మేరకు తాజాగా టాలీవుడ్ నటుడు తనీష్‌కు బెంగళూరు పోలీసులు సమన్లలు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ మొత్తం ఐదుగురికి నోటీసులు ఇవ్వగా అందులో ఓ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త కూడా ఉన్నారు. తనీష్ కు నోటీసులు పంపినట్టు బెంగళూరు పోలీసులు ధ్రువీకరించారు. 2017లో అప్పట్లో తెలుగు చిత్రపరిశ్రమను ఊపేసిన డ్రగ్స్ కేసులోనూ తనీష్ సిట్ ఎదుట హాజరయ్యాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more