Hero Tanish gives clarity over drugs case డ్రగ్స్ కేసులో నోటీసులు.. మీరు అనుకున్నవి కాదు: హీరో తనిష్

Hero tanish gives clarity about getting notice in karnataka drugs case

drugs scandal, Bengaluru East Zone police, Summons, Hero Tanish, Telugu Producer, Telugu Industrialist, Bigg Boss contestant, Mastan Chandra, bengaluru, karnataka, crime

Tollywood hero Tanish faulted a section of media for telecasting news as if he was involved in a drugs case related to Karnataka in which a film producer was taken into custody. The actor admitted that he received notice from police for meeting him once in Bengaluru regarding a movie. themselves for questioning.

ITEMVIDEOS: డ్రగ్స్ కేసులో నోటీసులు.. మీరు అనుకున్నవి కాదు: హీరో తనిష్

Posted: 03/13/2021 04:44 PM IST
Hero tanish gives clarity about getting notice in karnataka drugs case

రాష్ట్రంలో 2017లో డ్రగ్స్ కేసు వివాదం రేగిన నేపథ్యంలో తన కుటుంబం పడిన అవేదనను అర్థం చేసుకుని అలాంటివాటికి దూరంగా వున్న తనను ఇబ్బందుల పాటు చేసి..కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని హీరో తనీష్ అన్నారు. కాగా తనకు బెంగళూరు పోలీసులు ఇచ్చిన నోటీసల విషయాన్ని అంగీకరించిన ఆయన.. నోటీసులు ఇవ్వగానే తాను డ్రగ్స్ కేసులో వున్నానని, తన పాత వీడియోలు.. సినిమాల్లో నటించిన వీడియోలు తీసి.. వాటిని ప్రోజెక్ట్ చేస్తూ.. తన ఇమేజ్ కు డ్యామేజ్ కలిగించేలా కొన్ని మీడియా సంస్థలు సృష్టిస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

తనకు బెంగుళూరు పోలీసులు ఇచ్చిన నోటీసులు అక్విటల్ నోటీసులని.. డ్రగ్స్ కేసులో వున్నట్లుగా అభియోగాలను ఎదుర్కోంటున్న సంబంధిత శాండిల్ వుడ్ ప్రోడ్యూసర్ తో తనకు వున్న పరిచయం ఎలాంటి.. తనతో వున్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా.? అన్న వివరాలను తెలుసుకునేందుకు మాత్రమేనని అయితే వాస్తవాలను తెలుసుకోకుండా.. కనీసం తనను ఓ మాట అయినా అడగకుండా తనపై ఇష్టానుసారంగా మీడియాలో కథనాలు ప్రచురిచండం తనకు బాధ కలిగిస్తుందని అన్నారు.

కన్నడ మీడియాలో ఇలాంటి కథనాలు వచ్చాయంటే తన గురించి వారికి తెలియకపోవడం వల్లే కావచ్చునని, కానీ తెలుగు మీడియా కూడా ఇలాంటి కథనాలు ప్రచురించడం తనను సమస్యలోక్కి నెట్టే ప్రయత్నమేనని అన్నారు. అయితే అన్ని మీడియా సంస్థలు ఇలా చేయడం లేదని.. కొందరు మాత్రం తనతో ఫోన్ ద్వారా మాట్లాడి తన వివరణ తీసుకునే ప్రయత్నం చేయగా తాను వారికి పూర్తి విషయాన్ని చెప్పానని తనీష్ అన్నారు. ఇక తన తల్లి ఆరోగ్యం అసలు బాగోలేదని.. ఇలాంటి పరిస్థితుల్లో అమెకు ఇలాంటి వార్తలు తెలిస్తే అమె అరోగ్యం మరింత క్షీణిస్తుందని అన్నారు. దయచేసి తనపై సత్యదూరమైన విషయాలను ప్రసారం చేయకూడదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles