తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దారుణ హత్యకేసులో రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణపై రాష్ట్రోన్నత న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో మరో్ జాతీయ దర్యాప్తు సంస్థ సీబిఐ చేత విచారణ జరిపించాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇవాళ స్పష్టం చేసింది. పెద్దపల్లి ఘటనలో నడిరోడ్డుపై న్యాయవాద దంపతులను హతమార్చిన కేసు విచారణను స్వయంగా హైకోర్టు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో సీబిఐ చేత విచారించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కోంది.
న్యాయవాదులు వామన్ రావు, నాగమణి దంపతులను అత్యంత పాశవికంగా.. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై అగంతకులు కిరాతకంగా హత్య చేశారని,.. ఈ కేసులో తెరవెనుక అసులు పెద్దలు ఎందరో వున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ.. వారందిరి పేర్లు బయటకు రావాలంటే సిబీఐ చేత విచారణ జరిపించడమే మార్గమని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయవాది శ్రవంత్ శంకర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వామన్ రవు దంపతుల హత్య కేసుపై సీబీఐచే విచారణ చేపట్టాల్సిందిగా కోరారు. ఈ మేరకు హైకోర్టులో ఇవాళ విచారణకు వచ్చిన ఆయన పిటిషన్ ను న్యాయస్థానం విచారించింది.
ఈ కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకుందని.. రాష్ట్రప్రభుత్వానికి ఈ ఘటనపై సమగ్ర నిదేవిక ఇవ్వాల్సిందిగా కూడా అదేశించిందని న్యాయస్థానం పేర్కోంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ సరైన దిశలోనే సాగుతోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణలో న్యాయస్థానం డీజీపీకి కూడా నోటీసులను జారీ చేసిందని, ప్రస్తుతం ప్రభుత్వం అన్ని కోణాల్లో విచారణ జరిపుతోందని పేర్కోంది. ఇప్పుడు సీబిఐ విచారణకు అదేశిస్తే మళ్లీ సమయం వృధ్దా అవుతుందని న్యాయస్థానం తెలిపింది.
ఈ సందర్భంగా తమ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందన్న విషయమై పోలీసులు న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపారు. నిందితులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, సిసిటీవీ, మొబైల్ విజువల్స్ ఎఫ్ఎస్ఎల్కి పంపించాం అన్నారు. అలాగే మూడు ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులను గుర్తిస్తున్నామన్నారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ముగ్గురు ప్రయాణికుల వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ముందు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు వాడిన ఫోన్లను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 7కు కోర్టు వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more