Deshmukh's resignation holds no power: Sharad Pawar హోంమంత్రిపై అరోపణలతో ఇబ్బందుల్లో ఉద్దవ్ సర్కర్

Deshmukh was in nagpur hospital couldn t have met vaze in feb says pawar

Anil Deshmukh, Param Bir Singh, Sharad Pawar, Mumbai Police, sachin waze, Ambani bomb scare, Maharashtra Government, Param Bir Singh, Jayant Patil, Mansukh Hiran, Sachin Vaze, Mukesh Ambani, Antilia, NIACM Uddhav Thackeray, Maharashtra, Politics

NCP chief Sharad Pawar said that Deshmukh was in a hospital for Covid-19 treatment between February 5 and 15 in Nagpur and was later home quarantined in that city. In his letter to Maharashtra CM Uddhav Thackeray, Singh had mentioned meeting Deshmukh “in and around mid-February.”

ITEMVIDEOS: హోంమంత్రిపై అరోపణలతో ఇబ్బందుల్లో మహా వికాస్ ఆఘాడీ సర్కర్

Posted: 03/22/2021 02:53 PM IST
Deshmukh was in nagpur hospital couldn t have met vaze in feb says pawar

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై అవినీతి అరోపణలు ఓ వైపు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుండగానే.. ఇవాళ రాజ్యసభనూ కుదిపేశాయి. కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ ఈ అంశాన్నిసభలో లేవనెత్తడంతో బీజేపి, శివసేన, ఎన్సీపీ ఎంపీల మధ్య నినాదాలు ఊపందుకున్నాయి. తీవ్ర గంధరగోళం మధ్య చైర్మన్ సభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. కాగా బీజేపి ఎంపీలు అనిల్ దేశ్ ముఖ్ రాజీనామాను డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ కోశ్యారీని కలవనుంది. ఈ నేపథ్యంలో అధికార శివసేన కూటమి ప్రభుత్వం మాత్రం అనిల్ పై వచ్చిన అరోపణలను ఖండిస్తున్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని పార్క్ చేసిన కేసులో పోలీసు అధికారి సచిన్‌ వాజే అరెస్టు చేసిన తరువాత వస్తున్న అరోపణలతో రాష్ట్ర ప్రభుత్వంపై అరోపణలు పెల్లుబిక్కుతున్నాయి. 16 ఏళ్లు సస్పెన్షన్ లో వున్న వాజేను రాష్ట్రంలోని శివసేన ప్రభుత్వం పోస్టింగ్ కల్పించడంతో అరోపణలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలో ఇటీవలే బదిలీ అయిన ముంబై మాజీ పోలీస్ కమీషనర్ పరమ్ వీర్ సింగ్ కూడా మరో బాంబు పేల్చారు. హోం మంత్రి ప్రతినెలా రూ.100 కోట్ల వసూళ్లను వాజేకు లక్ష్యంగా పెట్టారంటూ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు రాసిన లేఖ.. మీడియాకు చిక్కడంతో అరోపణలు మరింతగా పెరిగాయి.

ఇదే సమయంలో మహా వికాస్ ఆఘాడీ కూటమి పెద్దగా.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పరిస్థితిని తన భుజాలమీద వేసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిచారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ సమయంలో హోంమంత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి 15 మధ్య అనిల్ దేశ్ ముఖ్ ఆసుపత్రిలో ఉన్నారన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి 27 మధ్య నాగ్ పూర్ లోని ఆయన ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నారని చెప్పారు. ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తుది నిర్ణయం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేదేనని అన్నారు.

అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలున్న కారును పెట్టిన కేసులో దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికే అవినీతి మరకలు అంటిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తులో లోపాలున్నాయని, వాటి నుంచి తప్పించుకునేందుకు ఈ నాటకాలని అన్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చేసిన అరెస్టులతోనే హిరెన్ ను ఎవరు చంపించారో తేలిపోయిందన్నారు. ఎవరి కోసం ఆ ఇద్దరు హిరెన్ ను చంపేశారని ప్రశ్నించారు. ఏటీఎస్ పోలీసులు సరైన దిశలో దర్యాప్తు చేస్తున్నారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles