మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై అవినీతి అరోపణలతో మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కోంటున్న తరుణంలో ఈ ఆంశంపై లోక్ సభలో చర్చ సందర్భంగా తూర్పారబట్టిన మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానాపై మరో శివసేన ఎంపి బెదిరింపులకు మరో ఇబ్బందికర పరిణామాంగా మరారింది. అనీల్ దేశ్ ముఖ్ రాజీనామా డిమాండ్ ను శివసేన ప్రభుత్వం ముందుంచిన ఈ తరుణంలో శరద్ పవార్ మీడియా ముందుకువచ్చి ఆయన కూడా దేశ్ ముఖ్ ను సమర్థించేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అయితే లోక్ సభలో చర్చ సందర్బంగా మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ మాట్లాడుతూ.. హోం మంత్రి తనకంటూ ఓ వ్యక్తిని నియమించుకుని ఆయనతో నెలకు రూ.100 కోట్ల వసూళ్లను ఇవ్వాలని టార్గెట్ నిర్ధేశించడం దారుణమని.. ఇలాంటి విషయాలు బయటకు తెలిస్తే.. దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా దీనినే అనుసరిస్తే.. దేశంలో శాంతిభద్రతలకు మరింత విఘాతం ఏర్పడే ప్రమాదముందని, ప్రభుత్వ అండతోనే అరాచకాలు సృష్టిస్తే ఇక ప్రజలకు శాంతిభద్రతలు ఎలా సమకూరుతాయని ఆమె ప్రశ్నించారు.
దాదాపు 17 పాటు సస్పెన్షన్ లో వున్న సచిన్ వాజేను పునర్నియామకం చేసింది ఉద్దవ్ థాకరే ప్రభుత్వమని.. ఇంతకాలం సస్పెన్షన్ లో వున్న వ్యక్తిని ఎందుకు రికాల్ చేశారని, ఈ క్రమంలో ముంబై మాజీ పోలిస్ కమీషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన అరోపణల్లో నిజముందని అమె అన్నారు. ఇదే వాజేను రికాల్ చేయాలని గతంలో దేవేంద్ర ఫెడ్నావిస్ ప్రభుత్వానికి అప్పట్లో మిత్రపక్షంగా వున్న ఉద్దవ్ థాకరే ఒత్తడి తీసుకువచ్చినా.. ఆయన అందుకు నిరాకరించారని.. నవనీత్ కౌర్ రానా శివసేన సర్కారును తూర్పారబట్టారు. అంతే ఇంకేముంది శివసేనకు చెందిన మరో ఎంపీ అమెను టార్గెట్ చేశారని అమె అరోపించారు.
ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించారని అమె లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అరెస్ట్ అయిన సచిన్ వాజే, మన్సుఖ్ హిరేన్ హత్య తదితర విషయాలపై మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు పార్లమెంటు ఆవరణలోనే తనను బెదిరించారని స్పీకర్ కు రాసిన లేఖలో నవనీత్ కౌర్ ఆరోపించారు. మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తానని, తనను కూడా జైలులో వేస్తానని హెచ్చరించారని అన్నారు.
మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తానని, తనను కూడా జైలులో వేస్తానని హెచ్చరించారని నవనీత్ కౌర్ రానా అన్నారు. ఆయన బెదిరింపులు మొత్తం మహిళా లోకానికే అవమానమని, వీలైనంత త్వరగా ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ఆ పిర్యాదు ప్రతులను ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీకి కూడా పంపారు. కాగా, నవనీత్ కౌర్ ఆరోపణలను శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ఖండించారు. ఆమెను తానెందుకు భయపెడతానని ప్రశ్నించారు. ఆమె వ్యవహార శైలి, స్పందించే విధానం ఏమీ బాగాలేదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more