తెలిసీతెలియక వయస్సులో మామిడి తోటను చూడాగానే అందులోకి వెళ్లి మామిడి కాయలను కోసిన ఇద్దరు మైనర్ బాలురను అక్కడి కాపాలాదారులు వేసిన శిక్ష వింటే ఒళ్లు గగర్పుడుతుంది. అసలు వీళ్లు మనుషులేనా.? లేక పైశాచిక ఆనందం పోందే మృగాలా అన్న అనుమానం కలుగుతుంది. మామిడి పిందెలు కోసినందుకు ఇద్దరు చిన్నారుల చేతులు కట్టేసి.. కర్రతో కొట్టుతూ.. వారి నోట్లో పేడను పెట్టి బలవంతంగా తినేలా చేసిన ఈ దారుణ ఘటన మహబూబాజాద్ జిల్లాలోని తొర్రూర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేసుకున్నారు.
మామిడి తోటలో పిందెలు తెంపడంతో ఆగ్రహించిన తోట కాపలాదారులు.. ఇద్దరు చిన్నారులపై అమానుషంగా శిక్షించి పైశాచిక ఆనందం పోందారు. చేతులు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. పశువుల పేడ తినిపించి పైశాచికానందం పొందిన ఈ దుర్మార్గులు ఈ యావత్ ఘటననంతా తమ ఫోన్లో వీడియో రికార్డు చేసి.. చిన్నారుల పట్ల అమానవీయ వ్యవహరించడం కూడా గోప్పగా భావించి.. వీడియోను వాట్సాఫ్ లో పోస్టు చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో పోలీసులు దృష్టికి చేరింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల శివారులోని బొత్తల తండాలో చోటు చేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోతు యాకూబ్, బానోతు రాములు శివారులోని మామిడి తోటకు కాపలాదారుగా ఉంటున్నారు. గురువారం తొర్రూరుకు చెందిన ఇద్దరు చిన్నారులు అమ్మాపురంలో బంధువుల వద్దకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో మామిడి తోట వద్ద ఆగి పిందెలు తెంపారు. అది చూసిన కాపలాదారు యాకూబ్ పరుగున వచ్చి చిన్నారుల చేతులు కట్టేసి చితకబాదాడు. అంతటితో ఆగకుండా పేడ నోట్లో కుక్కి మృగాడిలా వ్యవహరించాడు. దీనికి సంబంధించి తోట పక్క నుంచి వెళ్తున్న తండా వాసి ఒకరు తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సీహెచ్.నగేశ్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more