ధేశంలో కరోనా వైరస్ రెండో దశ శరవేగంగా విస్తరిస్తూ లక్షలాధి మంది దాని ప్రభావానికి గురవుతున్న వేళ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో పాటు ప్రధాని నరేంద్రమోడీపై కూడా ఇంటాబయటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇక కరోనా మహమ్మారిని జయించామని సాక్షత్తు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రే ప్రకటించడంతో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలను చాపచుట్టేయడంతోనే రెండో దశ ఉద్దృతి అంతకంతకూ పెరుగుతూ పోతోందని మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ తన అక్రోశాన్ని వెళ్లగక్కింది. ఇవాళ తన సంపాదకీయంలో కరోనా రెండో ధశ నేపథ్యంలో కథనాన్ని ప్రచురించిన లాన్సెట్.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది.
కరోనా తొలిధశ నియంత్రణలో ప్రారంభ విజయాలను అందుకున్న భారత్ చేజేతులా వాటిని నాశనం చేసుకుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్ టాస్క్ ఫోర్స్ నామమాత్రానికే పరిమితమయ్యిందని వాయించింది. ఏప్రిల్ వరకు ఈ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదని దీంతో ఆ కమిటీ కరోనాకు, దేశ ప్రజల అరోగ్యానికి ఇచ్చిన ప్రాముఖ్యత అర్థమవుతోందని తూర్పారబట్టింది. కరోనా కట్టడికి కేంద్ర కమిటీ తీసుకున్న చర్యల ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని, ఈ తరుణంలోనైనా భారత్ తన వ్యూహాన్ని పునఃసమీక్షించుకోవాలంటూ సునిశిత విమర్శలు చేసింది.
కరోనా రెండో దశలో దేశం ఎదుర్కోంటున్న విపత్కర పరిస్థితులకు కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మూడవ దశ కూడా తప్పక వస్తుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం తక్షణం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలని సూచనలు చేసింది. ఇప్పటి వరకు జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని పారదర్శకంగా వ్యవహరిస్తే మహమ్మారిపై విజయం సాధించవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో ఇటు ప్రధాని నరేంద్ర మోదీపైనా లాన్సెట్ తీవ్ర విమర్శలు చేసింది. రాజకీయాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత ప్రధాని కరోనాకు ఇచ్చివుంటే ఇంతటి విఫ్కతర పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కావని అభిప్రాయపడింది.
దేశ ప్రజల అరోగ్యంపై తన కబంధ హఃస్తాలను చాచి వారిని తన బారిన పడేట్టు చేస్తున్న కరోనా మహమ్మారిపై దృష్టి సారించని మోడీ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తనను విమర్శిస్తున్న వారిపై కొరడా ఝళిపించే ప్రయత్నం చేశారని రాసుకొచ్చింది. విమర్శలను నిలువరించడానికి ప్రయత్నిస్తూ బహిరంగ చర్చలకు దూరంగా ఉండడం క్షమార్హం కాదని తేల్చి చెప్పింది. ఇలానే కొనసాగితే ఆగస్టు 1 నాటికి దేశంలో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా వేసిందని, అదే జరిగితే ఆ జాతీయ విపత్తుకు మోదీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
కరోనా రెండో దశ ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరికలను పెడచెవిన పెట్టి.. కరోనాను జయించేశామన్న భావనకు భారత్ రావడమే విపత్కర పరిస్థితులకు కారణమైయ్యిందని రాసుకొచ్చింది.
భారత్ హెర్డ్ ఇమ్యూనిటీని సాధించేసినట్టు కొన్ని మోడల్స్ తప్పుగా చెప్పాయని, అది నిర్లక్ష్యానికి కారణమై ముందస్తు సన్నద్ధతను దెబ్బతీసిందని అభిప్రాయపడింది. ఐసీఎంఆర్ జనవరిలో నిర్వహించిన సీరో సర్వేలో దేశంలో 21 శాతం జనాభాలో మాత్రమే యాంటీబాడీలు ఉన్నట్టు తేలిందని, ఆ సమయంలో మోదీ ప్రభుత్వం ట్విట్టర్లో వచ్చిన విమర్శలను తొలగించడంపై కాకుండా కొవిడ్ నియంత్రణపై దృష్టిసారించి ఉంటే పరిస్థితి ఇంత దిగజారేది కాదని వివరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more