కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో చైనాపై నిత్యం రుసరుసలాడిన అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాటలో తాజాగా అస్ట్రేలియాకు చెందిన ప్రముఖ పత్రిక వీకెండ్ పయనించింది. కరోనా చైనా ల్యాబ్ లో జన్మించిన వైరస్ అని ఆయన చేసిన అరోపణలను వీకెండ్ పత్రిక సమర్థించింది. ప్రపంచాన్ని ప్రమాదం అంచుల్లోకి నెట్టేసిన కరోనా మహమ్మారిపై వీకెండ్ ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. ప్రపంచంపై తమ అజమాయిషీ చలామణి అయ్యేందుకు చైనా కృత్రిమంగా సృష్టించిన బయో వెపనే కరోనా వైరస్ అని వీకెండ్ పేర్కొనడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ విషయాన్ని ఇప్పటికే పలు దేశాలు అంతర్గతంగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నా బాహాటంగా మాత్రం ఎలాంటి కామెంట్ చేయడం లేదు. అయితే అస్ట్రేలియాకు చెందిన వీకెండ పత్రికలో ఈ కథనం ప్రచురితం కావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కరోనా మహమ్మారి విషయంలో చైనాపై ఇప్పటి వరకు ఉన్న అనుమానాలు నిజమేనని ఈ కథనం చెబుతోంది. అందుకు చైనాలో ఓ నివేదికను కూడా అస్ట్రేలియా పత్రిక తాజాగా వెలుగులోకి తీసుకువచ్చింది. 2015లో చైనా శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు రూపొందించిన ఓ నివేదికలో కరోనా వైరస్ ను బయో వెపెన్ గా అభివర్ణించారు. మనుషులపై దీని ప్రభావం భయానకంగా వుంటుందుందని, లక్షల్లో మనుషులు మరణిస్తారని పేర్కోనివుంది. ఈ వైరస్‌ను ఓ ఆయుధంగా వాడుకోవాలన్న కుట్ర ఈ నివేదికలో స్పష్టంగా కనిపిస్తోందని పత్రిక పేర్కొంది.
మూడో ప్రపంచ యుద్ధంలో ఈ బయో వెపన్ ను వినియోగించుకునేందుకు చైనా శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారిని అభివృద్ధి చేసిందని, ఇందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని రాసుకొచ్చింది. ఆరేళ్ల క్రితమే చైనా మిలటరీ శాస్త్రవేత్తలు దీని గురించి చర్చించారని కూడా వివరించింది. కరోనాలోని కొత్త స్ట్రెయిన్లను ఎలా ప్రయోగించాలన్న దానిపైనా వారి మధ్య తీవ్ర చర్చ జరిగిందని తెలిపింది. వైరస్ మూలాలపై బయటి సంస్థలు దర్యాప్తు జరిపితే దాని గుట్టు ఎక్కడ బయటపడిపోతుందోననే ఉద్దేశంతోనే బయటి సంస్థల దర్యాప్తును చైనా వ్యతిరేకించిందని పత్రిక పేర్కొంది. ఆ వైరస్ ఓ మాంసం మార్కెట్లో పుట్టిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు ప్రయత్నించిందని పత్రిక తన కథనంలో పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more