తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఉదయం పది గంటల నుంచి లాక్ డౌన్ విధించిన ప్రకటనను రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో వెలువరించగానే తొలుత మద్యం దుకాణాల వద్దకు మందుబాబులు బారీ సంఖ్యలో క్యూ కట్టిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మంత్రివర్గం సమావేశం దృష్టికి కూడా ఈ వీడియోలు చేరడంతో తెలంగాణలోని మందుబాబులకు క్యాబినెట్ సమావేశం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ సమయంలో వైన్ షాపులు కూడా మూతపడతాయని భావించిని వినియోగదారులు.. వైన్ షాపుల వద్ద ఎగబడతున్నారు.
అయితే మద్యాన్ని డోర్ డెలివరీ చేయడానికి అనుమతులివ్వాలని డిస్టిలరీ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. వైన్ షాపులు మూసివేస్తే ఆర్థికంగా ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లుతుంది. దాంతో ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. వైన్ షాపులను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అబ్కారీ కార్యాలయాలు కూడా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు తెరచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ప్రస్తుతం ఏపీలో కూడా ఉదయమే మద్యం దుకాణాలను తెరుస్తున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ ఖరారైంది. అయితే లాక్డౌన్లో నిత్యావసరాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలతో ఆదాయం తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఖరారు చేస్తోంది. పాలు, కూరగాయల దుకాణాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా ఉదయమే తెరిచి ఉంచుకోవాలని సూచిస్తోంది.
ప్రస్తుతం మద్యం దుకాణాలను ఉదయం 10 గంటల తర్వాతే తెరుస్తుండగా… ఇప్పుడు ఉదయం 10 గంటల తర్వాత మూసివేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మందుబాబులు లాక్డౌన్లో మద్యం కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో లాక్డౌన్ ఉంటుందని చాలాచోట్ల నెలకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు తెరచుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఇక ఎక్సైజ్ అధికారులు కూడా ఉదయం 8 గంటల నుంచి పది గంటల వరకు విధులను తప్పక నిర్వహించాలని అదేశాలను జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more