తను చెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్లు.. ఒక్కడి బుద్ది వక్రమార్గం పట్టిందంటే చాలు తన వక్రబుద్ది.. రాత్రికి రాత్రే తన అర్థిక పరిస్థితి మారాలన్న వాంఛ వారిని వక్రమార్గంలో నడిచేలా చేస్తోంది. ఒక్కడు దురాలోచనలతో వారి స్నేహితులు కూడా వాడి మాటలకు, చర్యలకు ప్రభావితం కావడం కామన్. తెలివైన వారైతే వాడి నుంచి దూరంగా జరుగుతారు. కానీ వక్రమార్గంలో నడిచైనా తాము సంపన్నులం కావాలని అనుకునేవారు తప్పక ఆవేశంలో తప్పులు చేసి.. అరదండాలు వేయించుకుంటారు. ఒక్క రోజు తప్పించుకోవచ్చు.. కానీ ఏదో ఒక రోజు మాత్రం చట్టానికి దొరక్కాల్సిందే.
ఎంతైంటి తెలివైనవారైనా నేరానికి పాల్పడితే కటకటాలు లెక్కబెట్టాల్సిందేనన్న విషయం తెలిసి కూడా ఇంకా వక్రమార్గంలో వెళ్లాలనుకుంటున్న వారి సంఖ్య ఉందంటేనే ఆశ్చర్యంగా వుంది. తాజాగా ఇలాంటి ఓ ముఠా పోలీసుల వలలో అడ్డంగా చిక్కింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు ఫుడ్ డెలివరీ బాయిస్ గా విధులు నిర్వహిస్తారు. అయితే రాత్రి కాగానే వారిలోని చీకటి కోణం బయటపడుతోంది. అప్పటి వరకు కష్టించి పనిచేసిన వీరు ఈజీ మనీ వేటలో పడి దారి దోపిడీలకు పాల్పడుతుంటారు. వృత్తిరిత్యా ఒకటి, ప్రవృత్తి మరోమార్గాన్ని అనుసరించి ఏడు ఊచలు లెక్కబెడుతున్నారు.
పుడ్ డెలివరీ యాప్ జోమాటో, స్విగ్గిలలో డెలివరీ బాయిస్ గా చేస్తూ చీకటి పడితే చాలు ఒంటరిగా వున్న వారిని టార్గెట్ చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా రాత్రి పూట ఒంటరిగా ఉన్న వారిపై దాడి చేసి దోపిడీలకు పాల్పడుతుందని పోలీసులు వెల్లడించారు. నిందితులు స్విగ్గీ, జొమాటోలలో పని చేస్తున్నట్లు వివరించారు. విలాసాలకు అలవాటు పడిన యువకులు ఈ విధంగా దోపిడీలు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. చోరి చేసిన ఫోన్లు, ఇతర సామగ్రిని ఓఎల్ఎక్స్లో నిందితులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more