భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషికి 30 రోజుల పెరోల్ లభించింది. ప్రస్తుతుం ఫుళల్ కేంద్ర కారాగారంలో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏజీ పేరరివాలన్ షరతులు లేని పెరోల్ పై నెల రోజులపాటు బయటకు రానున్నాడు. చెన్నైలో అధికార డీఎంకే పార్టీకి మిత్రపకంగా వున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత అధ్యకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషికి పేరోల్ లభించడం చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులో ఎంకే స్టాలిన్ కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఈ పిటీషన్ ఆయన ముందుకు రావడం కూడా హాట్ టాపిక్ గా మారింది. కంగాచెన్నైలోని జైలులో ఉన్న పేరరివాలన్ ఆరోగ్య పరిస్థితి ఇటీవల క్షీణించింది. దీంతో రెండు నెలలపాటు తన కుమారుడికి పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ అతడి తల్లి అర్బుదమ్మాళ్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు వినతిపత్రం పంపారు. పరిశీలించిన ముఖ్యమంత్రి పేరరివాలన్‌కు 30 రోజులపాటు షరతులు లేని సాధారణ పెరోల్ మంజూరు చేయాలని నిన్న జైళ్ల శాఖను ఆదేశించారు.
రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏడుగురు దోషుల్లో పేరరివాలన్ ఒకడు. 21 మే 1991న శ్రీపెరుంబదూర్ సమీపంలో మహిళా సూసైడ్ బాంబర్ ధాను చేతిలో రాజీవ్ హత్యకు గురయ్యారు. కాగా, గతేడాది మద్రాస్ హైకోర్టు పేరరివాలన్‌కు మెడికల్ చెకప్ కోసం 30 రోజుల పెరోల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు దానిని మరో వారం రోజులపాటు పొడిగించింది. ఇక తాజాగా నూతనంగా ముఖ్యమంత్రి పదవీబాధ్యతలు చేపట్టిన స్టాలిన్ కూడా ఆయన అనారోగ్యం కారణంగా 30 రోజుల అన్ కండీషనల్ పేరోల్ మంజూరు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more