Mehul Choksi may have fled Antigua and reached Cuba ఆర్థిక నేరస్థుడు ముఖుల్ చోక్సీ మళ్లీ పరార్..

Mehul choksi goes missing may have fled antigua and reached cuba

mehul choksi, mehul choksi missing, antigua, cuba, mehul choksi missing in antigua, mehul choksi antigua, mehul choksi fugitive, mehul choksi cuba, antigua, antigua and barbuda, who is mehul choksi, mehul choksi family, mehul choksi net worth, mehul choksi news, mehul choksi news in hindi, nirav modi, vijay mallya

Fugitive diamond trader Mehul Choksi, wanted in the Rs 13,000 crore PNB scam case, may have fled Antigua and could have landed in Cuba. The Antigua Police has filed a missing person’s report on diamond trader Mehul Choksi, who is wanted in the multi-crore PNB scam case. Mehul Choksi had taken the citizenship of the Caribbean island nation of Antigua and Barbuda.

ఆర్థిక నేరస్థుడు ముఖుల్ చోక్సీ మళ్లీ పరార్.. అంటిగ్వా నుంచి క్యూబాకు.?

Posted: 05/25/2021 12:14 PM IST
Mehul choksi goes missing may have fled antigua and reached cuba

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసు నిందితుడు, ఆర్థిక నేరస్థుడిగా అవతారమెత్తిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ (61) అంటిగ్వా నుంచి అదృశ్యమయ్యాడు. పీఎన్బీ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి రాగానే పెట్టా పేలా సర్ధుకుని దేశాన్ని వీడివెళ్లిన పలువురు ఆర్థిక నేరస్థుల బాటలోనే దేశం నుంచి పారిపోయి కరేబియన్ ద్వీపాల దేశమైన అంట్విగ్వా అండ్ బార్బుడాలో తలదాచుకుంటున్న చోక్సీ అకస్మాత్తుగా అక్కడి నుంచి కూడా అదృశ్యమయ్యాడు. ముకుల్ చోక్సీ అదృశ్యంపై అంటిగ్వా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ విషయాన్ని చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ నిర్ధారించారు. మెహుల్ చోక్సీ అదృశ్యంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారని విజయ్ అగర్వాల్ తెలిపారు. చోక్సీ అదృశ్యంపై అంటిగ్వా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. చోక్సీ రక్షణపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని అగర్వాల్ పేర్కొన్నారు. చోక్సీ కోసం పోలీసులు ఇప్పటికే వెతుకులాట ప్రారంభించారని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. నిన్న సాయంత్రం డిన్నర్ కోసం చోక్సీ ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లిన తర్వాత మళ్లీ కనిపించలేదు.

అయితే, అతడి వాహనాన్ని మాత్రం సాయంత్రం పొద్దుపోయాక జాలీ హార్బర్ లో గుర్తించారు. అయితే అతడి జాడ మాత్రం తెలియరాలేదు. చోక్సీ అదృశ్యంపై అంటిగ్వా పోలీసులు ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. పీఎన్‌బీ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలను సీబీఐ, ఈడీలు దేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ మాట్లాడుతూ.. చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేసి అతడిని భారత్‌కు అప్పగిస్తామని చెప్పారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ ప్రస్తుతం యూకేలో ఉంటున్నాడు. అతడిని కూడా భారత్‌కు రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles