తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా.. తుపానుగా.. అతి తీవ్ర తుపానుగా మారి ఒడిశాలోని బాలాసోర్, చాంధీపూర్ ల మధ్య తీరం దాటింది. ఈ క్రమంలో ఒడిశా సహా పశ్చిమ బెంగాల్ లోని అనేక ప్రాంతాల్లో యాస్ బీభత్సం సృష్టించింది. యాస్ తీరం ధాటే సమయంలో 155 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. వాయువ్య దిశగా కదులుతున్న తుఫాన్ మరో మూడు గంటల్లో పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. యాస్ అతి తీవ్ర తుపానుగా మారడంతో తీరం దాటే సమయంలో పెను భీభత్సం సృష్టించింది.
తుపాను కారణంగా చాంద్‌బలి ప్రాంతానికి అత్యంత ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను ప్రభావంతో ఓ వైపు ఒడిశా, బెంగాల్, సహా పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. ఇప్పటికే ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేయగా జార్ఖండ్, బీహార్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక బెంగాల్ లో మొదలైన వర్షాలు కుండపోతగా మారి రాష్ట్రాన్ని ముంచేస్తున్నాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని నదులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. వేగంగా వీస్తున్న గాలులకు అనేక చెట్లు నెలకూలాయి. వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి.
వర్షాల ధాటికి కపిల్ ముని మందిరం నీట మునిగింది. వర్షాలకు తోడు పెను గాలులు తోడవ్వడంతో విధ్వంసమే జరిగింది. అయితే ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి వుండగా, వరుణుడు శాంతించక ముందే రంగంలోకి దిగిన అధికారులు ఆస్తినష్టం ఏమేరకు ఉందని అంచనాలు వేయడానికి రంగంలోకి దిగారు. ఈ రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో తుఫాన్ బీభత్సంతో నివాసిత ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అధికారులు 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా తుఫాన్ ప్రభావాన్ని అధికంగా వున్న లోతట్టు ప్రాంతాల వద్ద సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నారు. ఫౌర్ణమి నాడు సహజంగా సముద్రం అలలు ఎగసిపడుతుంటాయి. దానికి పెను తుపాను కూడా తోడు కావడంతో మరింత రెట్టించిన వేగంతో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more