పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసు నిందితుడు, వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు, అవతారమెత్తిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ (61) మరోమారు పారిపోయిన విషయం తెలిసిందే. భారత్ నుంచి పారిపోయిన చోక్సీ అంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. అయితే అక్కడి కోర్టులో న్యాయవిచారణను ఎదుర్కోంటున్న ఆయన అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ఆయన అంటిగ్వా నుంచి పారిపోయి డొమినికా పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న అంటిగ్వాలో ఓ రెస్టారెంట్లో డిన్నర్ కు వెళ్లిన చోక్సీ ఆ తర్వాత మాయమయ్యాడు.
మెహుల్ చోక్సీ కోసం అంటిగ్వా పోలీసులు గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరోవైపు, చోక్సీ దేశం విడిచి వెళ్లే అవకాశమే లేదని ఆ దేశ ప్రధాని కూడా చెప్పారు. అయితే, తాజాగా చోక్సీ డొమినికా పోలీసులకు చిక్కినట్టు అక్కడి మీడియా తెలిపింది. అతడిని అంటిగ్వా పోలీసులకు అప్పగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాగా, చోక్సీ సముద్రమార్గం ద్వారా అక్రమంగా డొమినికాకు వెళ్లి ఉండొచ్చని అంటిగ్వా ప్రధాని తెలిపారు. చోక్సీని నిర్బంధించి అటు నుంచి అటే అతడిని భారత్‌కు తరలించాలని అంటిగ్వా ప్రధాని డొమినికాను కోరారు.
పీఎన్బీ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి రాగానే పెట్టా పేలా సర్ధుకుని దేశాన్ని వీడివెళ్లిన పలువురు ఆర్థిక నేరస్థుల బాటలోనే దేశం నుంచి పారిపోయి కరేబియన్ ద్వీపాల దేశమైన అంట్విగ్వా అండ్ బార్బుడాలో తలదాచుకుంటున్న చోక్సీ అకస్మాత్తుగా అక్కడి నుంచి కూడా అదృశ్యం కావడం సంచలనంగా మారింది. పీఎన్‌బీ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలను సీబీఐ, ఈడీలు దేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ మాట్లాడుతూ.. చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేసి అతడిని భారత్‌కు అప్పగిస్తామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more