NCB arrests drug peddler in Sushant Singh Rajput case సుశాంత్ సింగ్ కేసులో మరో డ్రగ్ పెడ్లర్ అరెస్టు

Ncb arrests drug peddler in sushant singh rajput case

Narcotics Control Bureau, Sushant Singh Rajput, drug peddler, Harish Khan, Mumbai flatmate, Siddharth Pithani, Hyderabad, Rhea Chakraborty, bodyguard, drug case, pithani send to NCB custody, NCB, Crime

The Narcotics Control Bureau (NCB) arrested a drug peddler named Harish Khan in the drugs case linked to the actor's death. The NCB had also probed Sushant's former domestic helps-- Neeraj and Keshav.

సుశాంత్ సింగ్ కేసులో మరో డ్రగ్ పెడ్లర్ అరెస్టు

Posted: 06/02/2021 03:59 PM IST
Ncb arrests drug peddler in sushant singh rajput case

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని దాదాపు ఏడాది కాలం కావస్తున్నా కేసు దర్యాప్తు మాత్రం నత్తనడకన సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్టు చేసి విచారించిన పోలీసలు అమె నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. దీంతో అమె జుడీషియల్ రిమాండ్ లో అండర్ ట్రయల్ ఖైదీగా వుండిపోయింది. గత ఏడాది అక్టోబర్ లో ఆమెకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అమె జైలు గోడల నుంచి బయటపడ్డారు.

కాగా ఈ కేసు సంబంధించి ఎందరినో విచారించిన పోలీసులకు విచారణ మాత్రం సవాలుగా మారింది. కాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు మాత్రం ఈ కేసులో పురోగతి సాగిస్తున్నారు. సుషాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుకు సంబంధించి అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. వారం క్రితం హైదరాబాద్ లో సుశాంత్ సన్నిహితుడైన సిద్ధార్థ్ పితానిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. తాజాగా బుధవారం సుశాంత్ కు సన్నిహితుడైన మరో వ్యక్తి హరీశ్ ఖాన్ ను ముంబైలోని బాంద్రాలో అరెస్ట్ చేశారు. అతడు పలువురు ప్రముఖులకు మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవాడని గుర్తించారు.

ప్రస్తుతం ఆ ఇద్దరినీ విచారిస్తున్నామని, ఆ వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. హరీశ్ ఖాన్ ఫోన్ లో, వాట్సాప్ చాటింగ్ లలో అతనికి డ్రగ్స్ సరఫరాదారులతో లింకులున్నట్టు తేలడం వల్లే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, గత ఏడాది జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అతడి గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తిని అధికారులు అరెస్ట్ చేసి విచారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushant Singh Rajput  drug peddler  Harish Khan  Mumbai flatmate  Siddharth Pithani  Hyderabad  NCB  Crime  

Other Articles