నెల్లూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అసుపత్రిలో కామాంధుడి ఆగడాలు బహిర్గతం అయ్యాయి, జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తన కూతురు వయస్సు కన్నా చిన్నవారైన విద్యార్థినులపై సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల పాల్పడిన ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో నేరం రుజువైతే సూపరింటెండెంట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంచార్జి కలెక్టర్ చెప్పారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. లైంగిక వేధింపుల పర్వంపై జిల్లాలోని డాక్టర్లు, మెడికోలలో తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు మెడికోలు సైతం ఇంచార్జి కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది.
సూపరింటెండెంట్, వైద్య విద్యార్థినికి మధ్య సంభాషణకు సంబంధించిన ఓ ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. కోరిక తీర్చాలంటూ వైద్య విద్యార్థినులు, మహిళా హౌజ్ సర్జన్లు, డాక్టర్లతో పాటు మహిళా సిబ్బందిని సూపరింటెండెంట్ వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కారులో ఒంటరిగా రావాలని, తనతో గడపాలని వారిని బెదిరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కొవిడ్ విధుల్లో ఉన్న ఓ వైద్య విద్యార్థినిని సైతం ఆ ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు గురిచేశాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆ వైద్య విద్యార్థిని ఎదురు తిరిగింది. ఆ అధికారికి ఫోన్ లోనే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. అతడిని కడిగిపారేసింది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సదరు సూపరింటెండెంట్ తనను ఎలా వేధించింది ఆ సంభాషణలో బాధితురాలు వెల్లడించింది. కూతురు ఆయసున్న ఆమె పట్ల ఆ వైద్యాధికారి వేధింపులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతకాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నా బయటికి చెప్పుకోడానికి హౌజ్ సర్జన్లు, డాక్టర్లు భయపడుతున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం తమ తల్లిదండ్రులకు తెలిస్తే చదువు మాన్పించేస్తారని పలువురు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మొత్తంగా ఈ ఆడియో టేపు బయటకు రావడంతో ఉన్నతాధికారి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. కీచక సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more