ప్రభుత్వ ఆసుపత్రల్లో తామ వారిని సరిగ్గా పట్టించుకోరని అపవాదు వుండటంతో ప్రైవేటు అసుపత్రులైతే తమ వారిని కాసింత పట్టించుకుంటాయని, కరోనా రెండో దశ విజృంభిస్తున్న వేళ.. పలువురు ప్రైవేటు అసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అయితే కరోనాను కూడా అరోగ్య శ్రీ కింది చికిత్స అందించేందుకు అనుమతించిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉదారతను అంతే చిత్తశుద్దితో చికిత్స అందించాల్సిన ప్రైవేటు అసుపత్రులు.. అటు ప్రభుత్వం నుంచి డబ్బును పోందడంతో పాటు ఇటు రోగి బంధువుల నుంచి కూడా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి.
దీంతో లక్షల్లో డబ్బులు వసూలు చెయ్యడమే కాదు. డబ్బులు ఇవ్వకపోతే బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కాకినాడలో ఆరోగ్య శ్రీ ద్వారా కరోనాకు వైద్యం చేసి కూడా.. రోగి బంధువుల నుంచి లక్షల్లో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఇనోదయ ఆసుపత్రిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో చేతులు కాలిన తరువాత అకులు పట్టుకున్న చందంగా రోగి నుంచి వసూలు చేసిన నాలుగన్నర లక్షల రూపాయలను ఆసుపత్రి యాజమాన్యం బాధితుని బంధువులకు అందజేసింది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడలోని ఇనోదయ ఆసుపత్రి ఇటీవల పెద్దాపురంకు చెందిన ఒక కరోనా రోగికి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేసి కూడా.. వారి బంధువుల నుంచి అక్రమంగా 4లక్షల 50వేల రూపాయలను వసూలు చేసింది.
అంతేకాదు.. మొత్తం ఆరు లక్షల రూపాయలను ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. తమ కుటుంబసభ్యుడి అరోగ్యమే పరమావదిగా భావించిన రోగులు ముందుగా నాలుగున్నర లక్షల డబ్బును చెల్లించారు. అయినా మరో లక్షన్నర రూపాయల కోసం బాదితుడి కుటుంబసభ్యులను అసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేయడంతో బాధితులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఆశ్రయించగా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు ఇనోదయ ఆసుపత్రిని డి నోటిఫై చేసి క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆసుపత్రికి 22లక్షల 50వేల రూపాయల పెనాల్టీ వేశారు. తాము చేసిన తప్పును ఆలస్యంగా దిద్దుకున్న ఆసుపత్రి యాజమాన్యం బాధితులకు వారి డబ్బును చెల్లించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more