కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది. కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో మన దేశంతో పాటు యావత్ ప్రపంచ దేశాలు కరోనా నిబంధనలను తప్పనిసరి చేశాయి. మాస్క్ ధరించకుంటే మన దేశం, మన రాష్ట్రంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు జరిమానాలు విధిస్తున్నాయి. పలు దేశాల్లో ప్రస్తుతం కోరనా రెండో దశ విజృంభిస్తుండగా, అగ్రరాజ్యంతో పాటు పలు అగ్రదేశాలు మాత్రం తమ రూటు సపరేటు అంటూ ప్రకటించుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు వాక్సీన్ వేయించుకుంటే లాటరీలు, బహుమానాలు భారీ ఆఫర్లు, కానుకలు, బీర్లు, ఇలా అనేక రకాల ఉచితాలు ఇచ్చి ఆయా దేశంలోని యువతను వాక్సీన్ తీసుకునేలా చేశాయి.
ఇక ఇప్పుడు అగ్రదేశాలు మారో మార్పు దిశగా పయనిస్తున్నాయి. ఆయా దేశల్లో సగం మందికిపైగా జనాభాకు టీకాలు వేయడం పూర్తయిన నేపథ్యంలో, కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని అగ్రదేశాలు ప్రకటించాయి. ఇందుకోసం ఇటీవలి వరకు ఆపర్లు ప్రకటించిన ఆక్కడి రెస్టారెంట్లు, కేఫ్ లు తాజాగా వడ్డింపులకు రెడీ అయ్యాయి. అఫర్లు ఏమిటీ, వడ్డింపులు ఏమిటీ.. అంటే.. ఇటీవలి వరకు తమ రెస్టారెంట్లకు మాస్క్ లేకుండా వచ్చి తమ ఆర్డర్లపై 50 శాతం రాయితీ పొందండీ అని ప్రకటించిన రెస్టారెంట్లు.. ఇక తాజాగా ధోరణి మార్చేశాయి. తమ రెస్టారెంట్లకు ఎవరైనా మాస్క్ ధరించి వచ్చి ఆర్డర్ ఇస్తే వారికి ఐదు డాలర్ల అదనపు వడ్డింపు తప్పదని ప్రకటించాయి.
అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉత్తర ప్రాంతంలో వున్న ఫిడిల్హెడ్ కేఫ్ రెస్టారెంట్ విస్తుపోయే ఈ నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది. మాస్క్ ధరించి వచ్చే వినియోగదారులకు జరిమానా వేస్తోంది. బిల్లుపై అదనంగా 5 డాలర్లు వడ్డిస్తోంది. నిజానికి అమెరికాలో మాస్క్ ధరించడం తప్పనిసరి కాకున్నా ముందుజాగ్రత్త చర్యగా కొందరు, భయంతో మరికొందరు మాస్కులు ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెస్టారెంట్ ఈ నిబంధన తీసుకొచ్చింది. ఇక ఇది చూసిన మిగతా రెస్టారెంట్లు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ చాలామంది వినియోగదారులు జరిమానా చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు కానీ, మాస్క్ తీసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. కాగా, ఇలా జరిమానాల రూపంలో వసూలైన మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు అందిస్తామని రెస్టారెంట్ యజమాని క్రిస్ కాస్టిల్మ్యాన్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more