తన అయుర్వేద ఔషదంతో కరోనా బాధితులకు నిమిషాల వ్యవధిలో ఉపశమనం కల్పిస్తూ పేదల నుంచి పెద్దల వరకు కరోనా రోగుల పాలిట ఆరాద్యుడిగా మారిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తన మందును పంఫిణీ చేస్తున్నారు. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నిన్న ఆనందయ్య కె మందుకు పచ్చజెండా ఊపుతూ తక్షణం ఆయన తన మందును పంఫిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అదేశాలను జారీ చేసిన క్రమంలో ఆయన నిన్నటి నుంచే మందుకు పంఫిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న కృష్ణపట్నంలో మందును తీసుకునేందుకు వచ్చిన వారి మధ్య తొక్కిసలాట కూడా జరిగింది.
హైకోర్టు అదేశాల నేపథ్యంలో ఆనందయ్య తన మందును ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందించారు. అయితే క్యూ పద్దతిలో ప్రజలు మందు కోసం వస్తే తోపులాట జరుగుతుందని భావించిన జిల్లా యంత్రాంగం.. ఇక ఇవాళ్టి నుంచి గ్రామ వాలెంటీర్లతో ఆనందయ్య మందును ఇంటింటికీ పంఫిణీ చేయిస్తోంది. నెల్లూరు జిల్లాలోని పలు మండలాలకు చెందిన గ్రామ వాలెంటీర్లకు ఆనందయ్య తన మందును అందించగా వారు ఇంటింటికీ వెళ్లి తమ గ్రామవాసులకు మందును అందిస్తున్నారు. నిన్న సర్వేపల్లిలో మందును పంచిన గ్రామ వాలెంటీర్లు ఇవాళ నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలంలో పంఫిణీ చేస్తున్నారు.
వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ ఈ ఔషధాన్ని పంఫిణీ చేస్తుండడం గమనార్హం. కొవిడ్ సోకిన వారికి ఎరుపు రంగు ప్యాకెట్ లోని మందు, కరోనా రాని వారికి ముందు జాగ్రత్తగా నీలం రంగు ప్యాకెట్ లోని మందును ఇస్తున్నారు. మరోవైపు, కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్ను తొలగించారు. రోజుకి రెండు వేల నుంచి మూడు వేలమందికి ఆనందయ్య మందును పంపిణీ చేయనున్నారు. కాగా, ఇతర ప్రాంతాల కరోనా రోగులకు ఆనందయ్య ఎప్పట్నించి మందును పంఫిణీ చేస్తారన్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆన్ లైన్ ద్వారా మందును ఎప్పడ్నించి అందుబాటులోకి వస్తుందన్న వివరాలు తెలియాల్సివుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more