లేటు వయస్సులో పెళ్లి కావాలంటే కాసింత కష్టమే. విద్యాబ్యాసం పూర్తికాగానే వ్యాపారంలో పడి తన వ్యాపారాభివృద్దిపైనే ధ్యాసపెట్టిన ఓ మధ్యస్థాయి వ్యాపారవేత్త.. వయస్సు పైబడుతున్న సమయంలో పెళ్లి గురించి ఆలోచించాడు, అప్పటికీ అమ్మాయిలు దొరక్కపోవడంతో ఓ మధ్యవర్తిని పట్టుకుని సంబంధానికి ఒకే చెప్పాడు. అప్పటికే 38 ఏళ్లు పైబడటంతో అమెను చూడకుండానే పెళ్లికి అంగీకరించిన వ్యాప్తారవేత్త.. అమ్మాయి ఎలా వున్నా పర్వాలేదని, ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేకపోయినా.. తనకు ఓకే అన్నాడు. అంతేకాదు పెళ్లి ఖర్చులు కూడా తానే భరిస్తానన్నాడు.
పెళ్ళికుదిరిందని సంతోషంలో జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చని అనుకున్నాడు. కానీ ఇంతలోనే పెళ్లికూతురు ఇచ్చిన షాక్ కు వ్యాపారవేత్త మైండ్ బ్లాక్ అయ్యింది. సర్లే అమె పోతేపోయింది.. కనీసం అమెను చూపించిన మధ్యవర్తి దొరికినా పర్వాలేదని అనుకునే సమయంలో ఆయన కూడా కనిపించలేదు. పెళ్లి కూతురు సోదరుడిగా పరిచమైన వ్యక్తి కూడా తన ఫోన్ ను స్విచాఫ్ చేయడంతో తనకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. పెళ్లైన గంటలోనే ఇదంతా చోటుచేసుకోవడంతో అతడి ఆశలు ఆవిరై పోయాయి. తన జీవితంలో దేనికోసమైతే తాను ఇంతగా ఎదురుచూశాడో.. అది జరిగింది. తన పరిస్థితి పెళ్లైంది కానీ పెళ్లి కూతురు పారిపోయిందన్నట్లు మారింది
వివరాల్లోకి వెళితే కర్ణాటకు చెందిన అంకిత్ జైన్ గత కొన్నేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ లోని సూరత్ కు చెందిన మధ్యవర్తి సతీష్ పటేల్ ద్వారా ఓ సంబంధం వచ్చింది. అమ్మాయి లక్షణంగా ఉండటంతో పెళ్ళికి సిద్దమయ్యాడు. పెళ్లి సంబంధం చూసిన మధ్యవర్తికి పెళ్లి కాకముందే రూ.20 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత పెళ్లికూతురు స్వాతీభట్ అన్నకి పెళ్లి ఖర్చుల నిమిత్తం లక్ష యాభై వేలు ముట్టచెప్పాడు. ఇక కాబోయే కోడలి కోసం అంకిత్ తల్లి రూ. 20 వేలు పెట్టి బంగారు ఉంగరం తెచ్చింది. ఇక పెళ్లి అంగుఆర్భాటం లేకుండా చేసుకుందామని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ లోని కపోద్రా ప్రాంతంలోగల తాపీ నది తీరంలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. దేవాలయం నుంచి యువతి పుట్టింటికి వధూవరులు కారులో బయలుదేరారు.
ఈ క్రమంలోనే తాను స్నాన్స్ తిని వాష్ రూమ్ కి వెళ్లివస్తా కారు ఆపండి అని చెపింది. కారు ఆపగానే దిగిన పెళ్లికూతురు స్వాతీభట్ ఏటో వెళ్ళిపోయింది. గంటకు పైగా వెతికినా కనిపించలేదు. దీంతో సంబంధం కుదిర్చిన మధ్యవర్తికి ఫోన్ చేశాడు వరుడు.. తాను యువతి సోదరుడికి ఫోన్ చేసి కనుక్కుంటానని చెప్పాడు మధ్యవర్తి. అయితే ఫోన్ చేస్తే ఇద్దరు లిఫ్ట్ చెయ్యలేదు.. దీంతో మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు యువకుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాతీభట్ కోసం గాలిస్తున్నారు. కాగా పెళ్లి జరిగిన గంటకే వధువు పారిపోవడంతో వరుడి ఆశలు అడియాశలయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more