ఫ్రాన్స్ ప్రెసిడెంట్.. ఇమాన్యుయెల్ మెక్రాన్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. దేశంలోని ఆగ్నేయ ప్రాన్స్ లో గల డ్రోమి ప్రాంతానికి వెళ్లేందుకు బయలుదేరిన ఆయనను నిరసనకారుల నుంచి పరాభవం ఎదురైంది. అభిమానులకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ముందుకెళ్లిన ఆయనపై నిరసనకారుడు చెంపదెబ్బను కోట్టాడంతో అవమానం కలిగింది. ఘటన నేపథ్యంలో వెంటనే అలర్ట్ అయిన భద్రతా పిబ్బంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇక మరికోందరు సెక్యూరిటీ సిబ్బంది ఆయనను పక్కకు తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
వచ్చే ఏడాది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగనున్న క్రమంలో పబ్లిక్ ఒపీనియన్ కోసం మెక్రాన్ దేశ వ్యాప్తంగా పర్యటన ప్రారంభించారు. వచ్చే 2 నెలల్లో 12 ప్రాంతాల్లో పర్యటించేందుకు రోడ్ మ్యాప్ రెడీ అయింది. ఈ క్రమంలోనే రెండో పర్యటనలో భాగంగా ఆగ్నేయ ఫ్రాన్స్ ప్రాంతంలో టెయిన్-ఐ హెర్మిటేజ్ అనే చిన్న పట్టణానికి చేరుకున్న మెక్రాన్ ముందుగా హోటళ్లు, రెస్లారెంట్లలో పనిచేసే యువతకు ట్రైనింగ్ ఇచ్చే హైస్కూల్ ను సందర్శించారు. ఆ తర్వాత తాను విశ్రాంతి తీసుకుని తిరిగి తన ప్రయాణాన్ని కోనసాగించారు. ఈ క్రమంలో తాను సేద తీరిన భవనం వద్దకు కొందరు అభిమానులు చేరుకున్నారు.
ఎన్నికల సమీపిస్తున్న క్రమంలో అభిమానులను పలకరించి వారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని భావించిన అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ వారిని కలుస్తూ.. షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు కదులుతుండగా, అభిమానుల మధ్యలో చేరిన ఇద్దరు వ్యతిరేకులలో ఒకరు ఆయనను చెంపదెబ్బ కొట్టారు. బారికేడ్లకు అవతలివైపు ఉన్న ఓ యువకుడు షేక్ హ్యాండ్ ఇచ్చేట్లుగా ముందుకొచ్చి ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ హాఠార్ఫరిణామంతో ప్రెసిడెంట్ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ ఆయనను వెనక్కి తీసుకెళ్లిపోయారు. కాగా ఘటనకు పాల్పడిన ఇద్దరిని బలగాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి.
FLASH | En déplacement dans la #Drôme ce mardi dans le cadre de son tour de #France des territoires, Emmanuel #Macron s’est fait violemment gifler, deux personnes ont été interpellées.
— Conflits France (@ConflitsFrance) June 8, 2021
(BFM) #MacronGiflé pic.twitter.com/3pjWQt0NAR
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more