మహారాష్ట్రలో ఎలక్ట్రానిక్ వస్తువుల లోడుతో వెళుతున్న ఓ కంటైనర్ ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి తిరగబడిపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు ట్రక్ వద్దకు భారీగా తరలి వచ్చి..అందిన కాడికి ఎలక్ట్రానిక్ వస్తువులను లూటీ చేసుకుపోయారు. ఎవరికి దొరికిన వస్తువుల్ని వారు పట్టుకుపోయారు.సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎల్ఈడీలు ఇలా ఏది దొరికితే దాన్ని పట్టుకుని ఉడాయించారు. వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల లోడుతో వెళుతున్న ట్రక్కు సోమవారం తెల్లవారుఝామున 3గంటల సమయంలో తిరగబడడంతో అక్కడున్న జనం ఆ ట్రక్కులోని రూ. 70 లక్షలు విలువచేసే ఫోన్లను ఎత్తుకెళ్లిపోయారు.
దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారి ఘటనాస్థలానికి చేరుకునేసరికే చాలా వరకూ వస్తువులు లూటీ జరిగినట్లుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టిన పోలీసులు మాట్లాడుతూ.. ఘటన వాషి తహసీల్ పరిధిలోని షోలాపూర్-ఔరంగాబాద్ హైవేపై ట్రక్కు బోల్తా పడిందని..దాంట్లోని ఎలక్ట్రికల్ వస్తువులు లూటీ అయ్యాయనీ..లూటీ అయిన వాటిలో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎల్ఈడీలు, బొమ్మలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయని తెలిపారు.
ఆ రోడ్డు మీదుగా వెళుతున్నవారితో పాటు సమీపంలోని గ్రామస్తులు కూడా వచ్చిన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. మరికొందరు కంటైనర్ తలుపును ధ్వసంచేసి మరీ విలువైన వస్తువులను లూటీ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. దీంతో పోలీసులు స్థానికులను విచారించగా..ఎవరెవరెవరు ఏఏ వస్తువుల్ని ఎత్తుకెళ్లారో కనిపెట్టారు. అలా వారు స్థానికులను మీరు పట్టుకెళ్లిన ప్రతీ వస్తువు ఇచ్చేయాలని హెచ్చరించటంతో కొందరు వారు తీసుకున్న వస్తువులను తిరిగి అప్పగించారు. మరికొందరు వస్తువులను తిరిగి ఇవ్వలేదు. కానీ వారు ఫలానా వస్తువులు పట్టుకెళ్లినట్లుగా రుజువు లేదు కాబట్టి ..మరోసారి గ్రామస్థులను పోలీసు అధికారి విజ్ఞప్తి చేశారు. దయచేసి పట్టుకెళ్లిన వస్తువుల్ని ఇచ్చాయని కోరటంతో మరికొంతమంది ఇచ్చేశారు. కానీ కొంతమంది మాత్రం ఇవ్వనట్లుగా తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more