కొవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం మరో 6 నుంచి 8 వారాల్లో పొంచి ఉందని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా పేర్కోన్న విషయం తెలిసిందే. కాగా మూడో దశలో డెల్లా డబుల్ మ్యూటెంట్ తో కలసి దక్షిణాఫ్రికాకు చెందిన కరోనా వస్తుందని కూడా నిపుణులు ఇప్పటికే చెప్పారు. రెండో దశలో తీవ్ర ప్రభావం చూపిన ఇండియా వేరియంట్ డెల్టా కాగా, మూడవ దశలో ప్రభావం చూపనన్న వేరియంట్ కు డెల్టా ప్లస్ అని పిలుస్తున్నారు. తొలిదశలో భయాందోళనకు గురిచేసిన మఃహమ్మారి రెండో దశలో తెలియకుండానే వచ్చేసి అనేక మందిని బలితీసుకుంది. ఇక మూడో దశ మాత్రం రాకుండానే అలజడికి గురిచేస్తోంది.
అయితే ఈ వేరియంట్ ప్రభావాన్ని అంచనా వేసేపనిలో ప్రభుత్వాలు, వైద్యాధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ పోకినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ రకం కరోనాను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా మాత్రమే వర్గీకరించింది. దాని తీవ్రతను బట్టి అది ఆంధోళనకర వేరియంటేనా.? కాదా,? అన్నది వర్గీకరించనుంది. డెల్లా ప్లస్ రకం కరోనా వ్యాప్తి, తీవ్రత, వేగం విషయాల్లో ఎలావుంటుందన్న సమాచారం కోసం కేంద్ర కుటుంబఆరోగ్యశాఖ అధికారులు వేచిచూస్తున్నారు. సమాచారం వచ్చిన తరువాత దాని గణన జరుగుతుందని తెలిపారు.
కాగా ఇప్పటికే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో విస్తరించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మహారాష్ట్రలో 21 డెల్టాప్లస్ వేరియంట్ కేసులను ఇప్పటివరకు గుర్తించినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా రత్నగిరిలో 9 కేసులు బయటపడ్డాయని.. దీంతో పాటు జల్ గావ్ లో ఏడు, ముంబైలో రెండు, పాల్ఘర్, ఠానే, సిందుదుర్గ్ జి్లాల్లో ఒక్కొక్క కేసులు వెలుగుచూశాయని తెలిపింది. ఈ వేరియంట్ తో మూడో దశ ప్రారంభమైనట్లేనన్న వార్తల నేపథ్యంలో మహారాష్ట్రలో మూడో దశ ముప్పు పోంచి వుందా.? అన్న మహారాష్ట్ర అరోగ్యశాఖ పరిస్థితులను నిషితంగా గమనిస్తోంది.
ఇక మహారాష్ట్రతో పాటుగా కేరళలో మూడు కేసులు, మధ్యప్రదేశ్ లో ఒక్క కేసు బయటపడ్డాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల వైద్యఅరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ లో 64 ఏళ్ల మహిళకు డెట్లాప్లస్ వేరియంట్ సోకినట్లుగా అమె నుంచి సేకరించిన నమూనాలు పరిక్షించగా విషయం బయటపడిందని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ వేరియంట్ లో అందోళనకరమైన విషయం కనుగోన్న వైద్యనిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్ మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఔషధాన్ని ఏమారుస్తుందని పరీక్షలు జరిపిన నివేదికలను రూపోందిన వారు కనుగొన్నారు. దీంతో ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, నిత్యం చేతులను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more