మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. దశాబ్ద కాలం కిత్రం బూట్ విధానంలో నిర్మితమవతున్న బెంగళూరు-మైసూరు హైవే కారిడార్ పై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రూ.2కోట్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు ఇకపై ఈ విషయంలో ఆయన సదరు కంపెనీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, స్టేట్ మెంట్లు కూడా ఇవ్వరాదని న్యాయస్థానం ఆంక్షలను విధించింది. ఈ నేపథ్యంలో సంస్ధకు జరిగిన పరువు నష్టంపై వారికి పరిహార రుసుమును చెల్లించాలని అదేశించింది.
2011 జూన్ 28న ‘గౌడర గర్జన’ పేరుతో సువర్ణ కన్నడ న్యూస్ ఛానల్ లో దేవెగౌడ ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఆ ఇంటర్వ్యూలో బెంగళూరు-మైసూరు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ నిర్మిస్తున్న నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్(ఎన్ఐసీఈ) ప్రాజెక్టుపై దేవెగౌడ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. స్వయంగా నిర్మించి నిర్వహించి బదిలీ చేసే పద్దతి (బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ పద్దతి) బూట్ పద్దతిలో నిర్మించిన ఈ కారిడార్ ను ఆయన లూట్ కారిడార్ గా అభివర్ణించారు. ప్రజాధనాన్ని ఎన్ఐసిఈ కంపెనీ లూటీ చేస్తోందని అరోపించారు. అంతటితో ఆగకుండా సంస్థ ప్రమోటర్, మెనేజింగ్ డైరెక్టర్ అశోక్ ఖెనీపై కూడా పలు అరోపణలు చేశారు.
అశోక్ ఖెనీ ఓ ల్యాండ్ మాఫియా అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో కంపెనీ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఆయన వ్యాఖ్యలతో తమ పరువుకు భంగం వాటిల్లిందంటూ దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన బెంగళూరు సెషన్స్ కోర్టు.. ఎన్ఐసీఈ ఆరోపణల్లో నిజం ఉందని తేల్చింది. ఎన్ఐసీఈ ప్రాజెక్టును గతంలో కర్ణాటక హైకోర్టు, సుప్రీంకోర్టు తమ తీర్పుల్లో సమర్థించాయని న్యాయస్థానం గుర్తుచేసింది. ఇది కర్ణాటక ప్రజల ప్రయోజనాల కోసం కంపెనీ చేపట్టిన పెద్ద ప్రాజెక్టు అని తెలిపింది. అలాంటి ప్రాజెక్టుపై పరువు నష్టం వ్యాఖ్యలను అనుమతిస్తే ప్రజల కోసం చేపట్టిన ప్రాజెక్టు ఆలస్యమవుతుందని అభిప్రాయపడింది. కంపెనీ పరువుకు భంగం కలిగించినందుకు గానూ ఎన్ఐసీఈకి దేవెగౌడ రూ. 2 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more