మనుషుల్లో స్వార్థం, వారిలోని ప్రేమను, ఆప్యాయతను, అనురాగాలను తుడిచిపెట్టేస్తున్నాయి. ఏదో ఒక ఘటన చూసిన నేపథ్యంలో మానవత్వంతో స్పందించే కొన్ని హృదయాలు తప్ప.. నిజమైన ప్రేమను పంచే మనిషే కరువయ్యాడంటే అతిశయోక్తి కాదు. కేవలం అమ్మ ప్రేమ తప్ప.. మనుషుల్లో మిగిలినదంతా స్వార్థ చింతనే. అయితే మనుషులతో పొల్చితే జంతువులతో మాత్రం నిస్వార్థమైన, నికల్మషమైన ప్రేమ కనబడుతుంది. వాటికి హాని జరుగుతుందనో.. లేక హాని చేశారన్న నేపథ్యంల తప్ప అవి కోపతాపాలకు గురికావు.
మనుషులు చూపించే ప్రేమ కంటే.. జంతువులే ఎంతో ప్రేమాప్యాయతలు కలిగి ఉంటాయనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యంలా నిలుస్తోంది. చిన్నారుల చేతికి ఓ చిన్నపాప బొమ్మనిస్తే వారు దానిని తయారు చేస్తూ తమను తల్లి ఎలా లాలిస్తుందో అలానే చేస్తూ క్యూట్ గా ఆడుకోవడం మనకు తెలుసు. అలాగే ఓ బుజ్జి కోతి పిల్లకు.. చిన్న కోడిపిల్లతో స్నేహం కుదిరింది. దీంతో దాని కోసం ఓ అరటి ఆకును వేసి దానిపై చక్కగా కూర్చొని.. కోడిపిల్లను ముద్దు చేస్తోంది. ఓర్నీ నీ ప్రేమ చాలురా బాబు అంటూ.. కోడిపిల్ల అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేసింది.
దీంతో దానిని దెగ్గరకు తీసుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుని నన్ను వదిలి వెళ్లకు.. ఇద్దరం ఆడుకుందాం.. అని ముద్దులు పెడుతోంది క్యూట్ కోతిపిల్ల. ఈ వీడియోను సోషల్ మీడియాలో IFS అధికారి సుశాంత నంద ట్విట్టర్లో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. సెక్లన నిడివి గల ఈ వీడియోలో వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. కోతిపిల్ల దాన్ని వెనక్కి లాగి హత్తుకుని ముద్దులు పెట్టడం కనిపిస్తుంది. వీడియోను చూసిన ఎవరికైనా ముఖంలో చిరునవ్వు రాక మానదు.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఇప్పటివరకూ 7.6 వేల వ్యూస్ దాటేశాయి.
Loved this magical interactions of two pure souls pic.twitter.com/FSV6c0Ite2
— Susanta Nanda IFS (@susantananda3) June 27, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more